ఒకప్పుడు పార్టీకి వెళ్లి రెండు పెగ్గులు తాగితే దానిని ‘పార్టీ’ అనేవాళ్ళు. ఇప్పుడు పార్టీ కి వెళ్లి రెండు గ్రాముల డ్రగ్స్ తీసుకుంటే దానిని ‘రేవ్ పార్టీ’ అంటున్నారు. డ్రగ్స్ బార్ లో దొరకవు. పబ్ లో దొరుకుతాయి. పైకి మందు ఉన్నప్పటికీ లోపల మాత్రం డ్రగ్స్ దండా నడుస్తుంది. ఇది రోజు రోజుకు మూడు పెగ్గులు ఆరు బాటిల్ల లాగా బాసిల్లుతోంది. డ్రగ్స్ వల్ల 54 రకాల రోగాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఈ మధ్య కనిపెట్టారు. ఈ డ్రగ్స్ వల్ల లాబాలకంటే నష్టాలే 90 శాతం ఎక్కువా. అవేమిటో తెలుసుకుందాము.
డ్రగ్స్ వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది.
చాలావరకు నరాల బలహీనత ఉన్న మగవాళ్ళే డ్రగ్స్ వైపు మొగ్గుతారు. ఎలాగైతే ‘వయాగ్రా’ మాత్ర వాడుతారో. డ్రగ్స్ వల్ల రక్తకణాలలో వేగం పుంజుకుంటుంది. నరాలల్లో మునుపు లేని శక్తి పెరుగుతుంది. దానివల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుంది.
కానీ ఆ తరువాత రక్తకణాలు దీనికి క్రమగా అలవాటుపడి సత్తుబడతాయి. అంటే డ్రగ్స్ వాడితేనే నరాలు గట్టిపడతాయి. లేకపోతే ఉన్న శక్తిని కోల్పోయి డీలా పడిపోతాయి. అంటే కాస్తో కూస్తో పని చేసే శక్తిని మనకు మనమే పాతరేసుకోవడం. ఈ డ్రగ్స్ కి అలవాటుపడితే మూత్ర పిండాలు దెబ్బతిని మగతనం పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే డ్రగ్స్ కి అలవాటుపడిన వాళ్ళ ప్రియురాలు లేదా భార్య అక్రం సంబంధాలకు ఎక్కువా అలవాటు పడతారు. అంటే మగవాడే ఆడవాళ్లకు అడ్డదారుల అడ్రెస్ చెప్పడం.
గుండె జబ్బులు మరి ఎక్కువ
గుండె జబ్బు సర్వసాధరనంగా జనాభాలో 4 శాతం అందరికి వస్తుంది. కానీ డ్రగ్స్ వాడే వారిలో రావడంలో 94 శాతం వస్తుంది అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. డ్రగ్స్ వల్ల రక్తకణాలలో వేగం పుంజుకుంటుంది. మనిషి గుండె ఒక క్రమ పద్దతిలో కొట్టుకుంటుంది. డ్రగ్స్ ఈ వేగాన్ని పెంచుతుంది. దాంతో దాని ఒరిజినల్ లయ తప్పుతుంది. అప్పుడు డ్రగ్స్ వాడినా ప్రమాదమే, డ్రగ్స్ ఒక్కసారిగా మానుకున్నా ప్రమాదమే. అంటే ఒక కారు వేగం గంటకి 180 కిలో మీటర్లు అనుకోండి. దానిని ౩80 కిలో మీటర్ల వేగంతో నడిపితే ఏమవుతుంది? అది గతి తప్పి గాలిలోకి ఎగిసి పడుతుంది. గుండె పరిస్టితి కూడా అంతే.
లివర్ దెబ్బ తింటుంది
డ్రగ్స్ వల్ల లివర్ దారుణంగా దెబ్బ తింటుంది. మందు తాగిన వాళ్లకు వైద్యం చేయవచ్చు. కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు ఏ మందు పని చేయదు. ఎందుకంటే మనం నిత్యం వాడే మెడిసన్లో కూడా డ్రగ్స్ ఉంటాయి. అయితే అవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కానీ హెరాయిన్ లాంటి డ్రగ్స్ ‘రా’ మేటిరియల్. కాబట్టి ఏ మందు కూడా ప్రభావం చూపదు. అంటే నాటుసారకు అలవాటు పడిన వాడికి బీర్ కిక్ ఇస్తుందా?
ఇవి కాకుండా మనం నిత్యం వాడే మెడిసన్ వాళ్ళమీద పని చేయదు. కాబట్టి కిడ్ని చెడిపోయినా, పేగులు చెడిపోయినా లేదా ఏ చిన్న రోగం వచ్చినా అంత తేలికగా తగ్గదు. కాబట్టి చావుకు ‘వీసా’ తీసుకున్నట్లే. యువత ఇప్పటికైనా మేలుకుంటే మంచిది.