తెలంగాణ రాష్ట్ర ప్రభుతం నిర్వహించిన పి ఎస్ సి పరీక్షల పేపర్ లీక్ అయ్యింది. ఒక తప్పు జరిగింది. అది ప్రభుత్వం తప్పు. క్షమించ వచ్చు.
నిన్న పదో తరగతి తెలుగు పేపెర్ కూడా లీక్ అయ్యింది. ఇది రెండో తప్పు. దీనిని క్షమిస్తే అది ప్రజల తప్పు అవుతుంది.
అందుకే ఉద్యోగాలు లేక ఒక చేత్తో పట్టా, మరో చేత్తో పొట్ట పట్టుకుని రోడ్డున పడ్డ యువకుల గుండె రగిలిపోయింది. వీళ్ళకు కు అండగా నిలవాలని యూత్ కాంగ్రెస్ కన్నెర చేసి కదునుతోక్కింది. ఇదెక్కడి దారుణం అని ప్రశ్నించింది. అలా ప్రశ్నిస్తే నాలుక కోస్తా? మమ్మల్ని అడిగే హాకు మీకు ఎవరు ఇచ్చార్రా? అనే జవాను కెసిఆర్ తరపున అధికారుల నుంచి వచ్చింది.
గుండె రగిలిన యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. అంతే! అల్ ఖైదా తీవ్రవాదుల్లా కొడుతూ, రోడ్ల మీద గొర్రెల్లా ఇడ్చుకుపోయి లాకప్ లో వేసి గోడ్డును బాదినట్లు చితక బాదారు.
ఇదెక్కడి ప్రజస్వమ్యం?
ఇదెక్కడి అరాచక వ్యవస్థ?
ఇదెక్కడి దొరల పాలన?
నాడు నైజాం ప్రభుత్వంలో కూడా ఇంత దారణం జరగలేదు. ప్రశ్నించే యువ నాయకుల గొంతు నొక్కడం కెసిఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? ఎవరి ఓట్లతో గద్దెన ఎక్కడో ఆ ఓటర్ల మీద ఏమిటి దౌర్జన్యం?
ప్రభుత్వం అసమర్థ పాలనవల్ల క్రమంగా లీకేజీలు రోజు రోజుకు పెట్రోల్ ధారలా పెరుగు తున్నాయి. ఇది ఒక ఆచారంగా మారింది. అరాచకంలా వెర్రి తలలు వేస్తోంది. ”మొన్న తప్పు చేసిన కిందిస్టాయి ఉద్యోగులను పదకొండు మందిని సస్పెండ్ చేశాము కదా? నిన్న జరిగిన లీక్ లో నలుగురిని సస్పెండ్ చేశాముగా?” అని ఏదో ఘన కార్యం చేసినట్లు మీసం వేలివేస్తోంది ప్రభుత్వం. కానీ అసలు అలాంటి తప్పు జరగకుండా ఏం చేసున్నారో చెప్పలేని దుస్తితి, అవినీతిలో పూరుకుపోయింది ప్రభుత్వం.
ఒకప్పుడు యువత పరీక్ష రాశాక ఫలితాల కోసం ఎదురు చూసేది. ఇప్పడు ఆ పరీక్షా పత్రాన్ని ఎవరు ఎప్పుడు లీక్ చేశారో, ఆ పరీక్ష ఎప్పుడు రద్దు అవుతుందో తెలియక భయంతో బిక్కు బిక్కున గడిపే దుస్తితి దాపురించింది. ఇది తప్పని వాక్ స్వాతంత్రంతో ప్రశ్నించిన యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన నిరంకుశ బిఆర్ఎస్ ప్రభుత్వం మరో తప్పు చేసింది.
అక్కడితో ఆగక ఈరోజు పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ చేసిన ఎస్ఎస్సి బోర్డ్ ముందు తమ నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది కెసిఆర్ ప్రభుత్వం. అధికారం ఉందికదాని ఇలాంటి అహంకార పూరిత పనులకు చేస్త, వెయ్యి కళ్ళతో గమనిస్తున్న ప్రజలు ఊరుకోరు. దీనికి తగిన మూల్యం కెసిఆర్ చెల్లించుకోక తప్పదు అని జనం కన్నెర్ర చేస్తున్నారు. మొన్న టి ఎస్ పి ఎస్ సి పేపర్, నేడు పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ కావడానికి బాధ్యత వహిస్తూ అసమర్థ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ యువ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాము అని హెచ్చరిస్తున్నారు.
అరెస్ట్ చేసిన వాళ్లు అల్లాటప్పా యూత్ కాంగ్రెస్ నాయకులు కాదు. వారిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివ రాథోడ్, హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ మోత రోహిత్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్, ఎల్ బి నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి లాంటి ప్రముఖులు ఉన్నారు.
రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకుల వెంట రాష్ట్ర కాంగ్రెస్ బలగంతో పాటు యువత వెన్నంటి ఉంది. వాళ్ళు గళం ఎత్తే రోజులు రానే వచ్చయి.