హిందువులు గొడ్డు మాంసం తినడం అంటే దానిని మించిన పాపం మరొకటి లేదని బిజెపి, దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎప్పటినుంచో ప్రచారం చేస్తోంది. ఈ నినాదం వాళ్ళ ఓటు బ్యాంకు కూడా. దేశంలోని ఆవులను చంపరాదని, కబేళలను ముసివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా గొడ్డు మాంసం అమ్మడాన్ని నిషేదించే కొత్త చట్టాలు తెచ్చింది. ఆవును కౌగిలించుకునే రోజు లాంటి హడావుడి చేస్తోంది. మరి ఆ హిందూ మతం అనే ఓటుకే తూట్లు పెడుతూ మేఘాలయ బిజెపి అద్యక్షుడు ఎర్నెస్ట్ మౌరి సంచలన వ్యాక్యలు చేసి బాంబు పేల్చారు.
”నేను గొడ్డు మాంసం తింటాను. మా మేఘాలయలో అందరు తింటారు. మా రాష్ట్రంలో గొడ్డు మాంసం పై ఎలాంటి నిషేదం లేదు. మాకు కబేళలు ఉన్నాయి. అక్కడ గొడ్డు మాంసం కొనడం, అమ్మడం ఇప్పటిల జరుగుతోంది. ఇది మా రాష్ట్రం సంస్కృతిలో ఒక భాగం. దీనిని కాదనే హక్కు ఎవ్వరికి లేదు” అని బిజెపి సిద్దాంతాలను బాహాటంగా ఎదిరించాడు. దానికితోడూ ఫిబ్రవరి 27న మేఘాలయలో అసంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బిజెపి అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
హిందువులు గొడ్డు మాంసం తింటే నాలుక తెగ్గోయండి అని ప్రకటించే బిజెపి నేతలు మరి ఎర్నెస్ట్ మౌరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ కూడా చేయలేదు. అంటే బిజెపి చెప్పే నీతులు ప్రజలకు ఒకరకంగా, వాళ్ళ పార్టీ వాళ్ళకు మరో రకంగా అమలు చేస్తోందా? అని హిందూ సంఘాలు అడుగుతున్నాయి.