‘కయ్యమెలా వస్తుంది జంగమయ్యా? అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండా’ అన్నది మన పాత సామెత. ఇప్పుడు బిజెపి తీరు కూడా అలాగే ఉంది. నగరంలో ఇన్ని గుళ్ళు ఉండగా పాత బస్తీలోని చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి గురినుంచి ప్రతి యాత్రను మొదలు పెడుతుంది. పక్కనేఉన్న మక్కా మసీదులో ప్రార్ధనలు జరిగే శుక్రవారం ముహూర్తం పెడతారు.
ఇదిచాలదు అన్నట్లు ఆదివారం పాత బస్తీలోని కార్వాన్ లో బండి సంజయ్ నాయకత్వంలో ఛత్రపతి శివాజీ యువరాజ్ జయంతి వేడుకలను బిజెపి చేపట్టింది. ఈ యాత్ర పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఏదో కుట్ర దాగుంది అన్నట్లు నగరవాసులు భయపడుతున్నారు.
ఛత్రపతి శివాజీ యువరాజ్ మహారాష్ట్ర భక్తుదు. కానీ దేశ నాయకుడు కాదు. ఆయన జయంతి వేడుకలను మహారాష్ట్ర లోనే బిజెపి మినహా మరెవ్వరు చేయడం లేదు. ఆయనకు తెలంగాణకు ఏమిటి సంభందం? అయన తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏమిటి? చేసిన సేవ ఏమిటి? కనీసం అతను దేశం కోసం కూడా చేసింది ఏమిలేదు. కేవలం మహారాష్ట్ర కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఓ ప్రాంతీయ నాయకుడు. తని పట్ల తెలంగాణాలో అందరికి గౌరవం ఉంది. దానిని బిజెపి తనకు అనుకూలంగా రాజకీయాల కోసం వాడుకోవడం సోచనియం.
మునుపెన్నడూ జరపని ఛత్రపతి శివాజీ యువరాజ్ జయంతి వేడుకలను పాత బస్తీలో బండి ఎందుకు నిర్వహిస్తున్నారో అతనికే తెలియాలి. మన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జయంతి వేడుకలు మహారాష్ట్రలో నిర్వహిస్తారా?
నగరంలో మార్వాడీలు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ఈ వేడుకలు నిర్వహించకుండా, కావాలని కార్వాన్ లో ఎందుకు జరిపారో? జరిపితే జరిపారు. కానీ రోజు కెసిఆర్ ని తుర్పాల పట్టే బండి మజ్లిస్ మీద విరుచుకు పడ్డారు. దమ్ముంటే 119 సీట్లలో పోటి చేయాలనీ మజ్లిస్ కి సవాలు విసిరారు. బిజెపి సింహం లాంటిదని, సింగిల్ గా పోటి చేస్తోంది అన్నారు. దమ్ముటే బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకుండా పోటి చేయాలనీ మజ్లిస్ ని ఎద్దేవ చేశారు. ఇదంతా ఎన్నికల స్టంట్ లా లేదు?
ఇలాంటి ఊరేగింపులు, ఇలా రెచ్చ గొట్టే వాక్యలు ఎలాంటి పరిణామాలకు దారి తిస్తాయోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా మతకలహాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న జంట నగరాల్లో ఇలాంటివి అవసరమా? ఏమ్మెల్లె రాజా సింగ్ లాగే బండి కూడా కష్టాలు తప్పేలా లేవని ప్రజలు అనుకుంటున్నారు.