నారాయణ గుట్టులాగిన పోలీసులు
నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, ప్రధాన నిందితుడు గిరిధర్‌రెడ్డిని విచారించిన పోలీసులు
మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించిన గిరిధర్ రెడ్డి
జేఈఈ, నీట్ లాంటి పరీక్షల్లో ర్యాంకులపైనే నారాయణ సంస్థలు దృష్టి ఎక్కువగా పెడతాయని వెల్లడి
మాథ్స్, సైన్స్‌లపైనే ప్రధాన దృష్టి ఉంటందన్న గిరిధర్ రెడ్డి
తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజ్ సబ్జెక్టులు, సోషల్‌స్టడీస్‌పై నిర్లక్ష్యం ఉంటుందని చెప్పిన ప్రధాన నిందితుడు
అందుకే విద్యార్థులకు వీటిపై పట్టు ఉండదని వెల్లడి
వీటన్నింటినీ అ«ధిగమించి పదోతరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడానికి నారాయణ సంస్థలు ప్రయత్నాలు చేస్తాయని పోలీసులకు చెప్పిన గిరిధర్ రెడ్డి
దీంట్లో భాగంగానే ప్రతి ఏటా పదోతరగతి పరీక్షల ముందు ఉభయ తెలుగురాష్ట్రాల్లోని స్కూల్ డీన్లు, వైస్ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్‌తో భౌతికంగా విజయవాడలో లేదా, వర్చువల్‌గా నారాయణ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పిన గిరిధర్ రెడ్డి
నారాయణ ఆదేశాల ప్రకారం, ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతిజిల్లాలో çపదోతరగతి పరీక్షల్లో ప్రతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లు ఉన్న టీచర్ల జాబితాలను సంపాదిస్తామని వెల్లడి
డీఈఓ కార్యాలయాల్లో క్లరికల్ సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఈ జాబితాలు సంపాదిస్తామని నిజాలు చెప్పిన గిరిధర్ రెడ్డి
తర్వాత ఇన్విజిలేటర్లకు భారీగా నగదు, బహుమతులు ఇస్తామని
వారి సహాయంతో ప్రశ్నపత్రాలను వివిధ రూపాల్లో సంపాదిస్తామంటూ స్కాం నడిచే తీరును వెల్లడించిన గిరిధర్ రెడ్డి
ఆ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన వారితో సమాధానాలు రాయించి వాటర్ బాయ్స్ ద్వారా లేదా, ఏఎన్‌ఎంలద్వారా లేదా సహకరిస్తున్న ఇన్విజిలేటర్ల ద్వారా నారాయణ సంస్థలకు చెందిన విద్యార్థులకు పంపిస్తామంటూ మొత్తం విషయాలను బయటపెట్టిన గిరిధర్ రెడ్డి
నారాయణ ఆదేశాల ప్రకారం అదివరకే తిరుపతి నారాయణ స్కూల్లో పనిచేసి, ప్రస్తుతం ఎన్నారై అకాడమీలో పనిచేస్తున్న సుధాకర్ అనే వ్యక్తిద్వారా తెలుగు ప్రశ్నపత్రాన్ని గిరిధర్ రెడ్డి సంపాదించారని పోలీసుల వెల్లడి
దీనికి బాల గంగాధర్ నే వ్యక్తి ప్లాన్‌చేశాడంటున్న పోలీసులు
ఈ ప్రశ్నలకు సమాధానాలను గిరిధర్ రెడ్డి తెప్పించుకున్నారని,
అంతేకాకుండా మరింతమందికి ప్రశ్న పత్రాన్ని చేరవేయాలనే ఉద్దేశంతో కొంతమంది టీచర్లకు కూడా ఫార్వార్డ్ చేశారని గర్తించిన పోలీసులు
అంతేకాకుండా ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావాలనే ఉద్దేశంతో చిత్తూరు టాకీస్ పేరుతో నడుస్తున్న మీడియా ప్రతినిధుల వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేశాడని దర్యాప్తులో పేర్కొన్న పోలీసులు.