పాకిస్థాన్ లో మహిళలపై జరుగుతోన్న దారుణాలు నానాటికీ అధికం అవుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ హిందూ మహిళపై కొంతమంది కామందులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మతం మారాలంటూ ఒత్తిడి చేస్తు ఈ దారుణానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సింద్ ప్రావిన్స్ లో ఓ మహిళ పట్ల కొంతమంది వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. మతం మారాలంటూ ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో కిడ్నాప్ చేసి ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు బంధించి మహిళాపై విడతల వారీగా అత్యాచారం చేశారు. చాకచక్యంగా ఆ కామందుల బారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మోంగ్రియో వారి సహచరులు బెదిరించారు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేశారు. మూడు రోజులపాటు బంధించి అత్యాచారం చేశారు. చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపాను. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం వాళ్లు పట్టించుకోలేదు” అని బాధితురాలు ఆరోపించింది.
Also Read : బాబా అవతారమెత్తి 120మంది మహిళలపై అత్యాచారం..!