ప్రపంచంలోని అతి పెద్ద కుంబకోణంగా చెప్పుకునే అదాని గ్రూప్ గురించి మన కేంద్ర ప్రభుత్వం కావాలని మర్చిపోతోంది. ప్రజలు కూడా మర్చిపోయేలా చేస్తోంది. కానీ ఆ విషయం మర్చిపోకుండా, మన దేశం బాగుకోరుతూ విదేశీ సంస్థ హిండెన్ బర్గ్ ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది. శ్మశానంలో తొవ్వే కొలది ఎముకలు అన్నట్లు భయానక కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. నిజానికి ఈ పని చేయవలసింది మన కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ పనిని పరాయివాళ్ళు చేస్తుంటే మనవాళ్ళు కునుకు తీస్తున్నారు.
‘ఇచ్చితినమ్మా వాయినం – పుచ్చుకుంటినమ్మా వాయినం’ అన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వాయినం ఇచ్చింది. దానిని కోర్టు ‘పుచ్చుకుంటి నమ్మా వాయినం అన్నట్లు’ నిపుణుల కమిటి వేసున్నట్లు ప్రకటించింది. కానీ ఆదాని గ్రూప్ల మీద ఎలాంటి నిషేధాలు ఇంకా ప్రకటించలేదు. ఆ అవినీతి ఇంకా ఎన్ని రంగాలకు వ్యాపించిందో తెలుసుకునే ఏర్పాట్లు ఇంకా చేయలేదు. ఆ దిశగా ఎలాంటి ఆదేశాలు ఇంకా వెలువడలేదు. ఇల్లు అంటుకుంది అంటే ఆ నేరస్తులను పట్టుకుంటాం అన్నట్లు ఉంది – కానీ ముందుగా ఆ మంటలు అర్పి మరిన్ని ఇల్లు తగలబదకుండా చేయాలనీ ఎవ్వరికీ లేదు. కానీ ఆ పనిని హిండెన్ బర్గ్ చీఫ్ ఎడిటర్ ఆండర్సన్ చేపట్టడం అభినందనీయం.
ఎవ్వరు నమ్మలేని నిజం ఏమిటంటే – లోగడ అదాని సంస్థ తనగురించి, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాసాల్ని వికీపీడియా లో ప్రచురించింది. ఆ వివరాలను ప్రపంచం నమ్మిది. ఎందుకంటే వికీపీడియా నిజాయితీ మీద ప్రపంచానికి ఉన్న నమ్మకం అది. కానీ గౌతమ్ అదాని ప్రపంచ మూడో ధనవంతుడిగా ఎదగగానే తన వక్ర బుద్ది అక్కడ కూడా చూపాడు.
వికీపీడియా ఉచిత సమాచారాన్ని అందించే గొప్ప ఆన్లైన్ పత్రిక. వికీపీడియా లోని వ్యాసాల్ని సరిదిద్దే వీలు.. వెసులుబాటు ఉంటుంది. ఈ లొసుగును ఆధారంగా చేసుకొని నలభైకు పైగా ఫేక్ ఖాతాల సాయంతో వాటిని ఒక క్రమ పద్దతిలో అదాని మార్పించాడు. అంటే అదానీ.. ఆయన కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన తొమ్మిది వ్యాసాల్ని ఇలా మార్పులు చేసినట్లుగా ఆండర్సన్ పేర్కొన్నారు. అది కూడా చాలా తెలివిగా ఓ క్రమపద్దతిలో అదాని తొలగించినట్లుగా ఆయన తగిన ఆధారాలతో సహా పేర్కొన్నారు. ఇక మన దేశాన్ని హిండెన్ బర్గ్ కాపాడాలి.