టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో విశేష ఆదరణ పొందింది. ఈ షో కు వచ్చే టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు బాలయ్యతో చిట్ చాట్ చేస్తున్నారు.
ఈ షో ద్వారా బాలయ్య సెలబ్రిటీల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ , పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వంటి వారు ఈ టాక్ షో లో పాల్గొన్నారు. అయితే, ఈ షో కు సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా మీడియా స్ట్రీమింగ్ చేయకముందే సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆహా టీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో కు గెస్ట్ గా వెళ్ళారు. ఆయన ఈ టాక్ షో లో పాల్గొన్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఆహా టీం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ షో ను అనధికారికంగా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారని దీని వలన తాము నష్టపోతున్నామని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఆర్డర్స్ ఇవ్వాలని కోర్టును కోరారు.
ఆహా టీం దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించి తక్షణమే అనధికారిక ప్రసారాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఎపిసోడ్స్ ప్రసారం కాకముందే సోషల్ మీడియాలో ఎవరైనా ఈ షో కు సంబంధించి వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేసిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.
Also Read : మూడు పెళ్ళిళ్ళపై అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ
Also Read : పెళ్ళైన ఆరు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూర్ణ..!