నిరుద్యోగ యువతకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్/అటెండర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కామారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆడ, మగ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మగవారితో పాటు ఆడవారికి కూడా దాదాపు చాలా ఖాళీలు ఉన్నాయి. ఏపీకి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ వివరాల కోసం పూర్తి సమాచారం తెలుసుకోండి..
మొత్తం ఖాళీలు: 1903
ఎగ్జామినర్ ఖాళీలు: 70
ఫీల్డ్ అసిస్టెంట్: 77
జూనియర్ అసిస్టెంట్: 268
ఆఫీస్ సబ్ ఆర్డినేట్/అటెండర్: 1226
ప్రాసెస్ సర్వర్: 165
రికార్డ్ అసిస్టెంట్: 97
ఉద్యోగ ఎంపికకు ఉండాల్సిన అర్హతలు:
ఎగ్జామినర్ పోస్టు అర్హతలు: ఇంటర్ లేదా ఆపై చదువు
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత
జూనియర్ అసిస్టెంట్ పోస్టు అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఆఫీస్ సబ్ ఆర్డినేట్/అటెండర్ పోస్టు అర్హతలు: 7వ తరగతి నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 10 కంటే ఎక్కువ చదువు ఉన్న వారు అనర్హులు. కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ వంటి పనులు వచ్చి ఉండాలి.
ప్రాసెస్ సర్వర్ పోస్టు అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ వంటి పనులు వచ్చి ఉండాలి.
రికార్డ్ అసిస్టెంట్ పోస్టు అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
వయసు పరిమితి: (అన్ని పోస్టులకు)
01/07/2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ళ లోపు ఉండాలి.
దరఖాస్తు రుసుము: (అన్ని పోస్టులకు)
ఓసీ, బీసీ అభ్యర్థులకు: రూ. 600/-
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 400/-
తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: రాయితీ ఉంటుంది.
ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతాలు:
ఎగ్జామినర్ జీతం: రూ. 22,900/- నుంచి రూ. 69,150/- వరకూ
ఫీల్డ్ అసిస్టెంట్ జీతం: రూ. 24,280/- నుంచి రూ. 72,850/- వరకూ
ఆఫీస్ సబ్ ఆర్డినేట్/అటెండర్ జీతం: రూ. 19,000/- నుంచి రూ. 58,850/- వరకూ
ప్రాసెస్ సర్వర్ పోస్టు జీతం: రూ. 22,900/- నుంచి రూ. 69,150/- వరకూ
రికార్డ్ అసిస్టెంట్ పోస్టు జీతం: రూ. 22,240/- నుంచి 67,300/-
ఇతర వివరాలు:
హాల్ టికెట్ డౌన్ లోడ్ తేదీ: 15/02/2023
పరీక్ష తేదీ: మార్చి 2023
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో
గమనిక : పై పోస్టులన్నిటికీ దరఖాస్తు చివరి తేదీ: 31/01/2023 రాత్రి 11.59 వరకూ