–తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.
–సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.
–కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు.
–రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించిన కేంద్రం
–కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.
–క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ కుమార్.
–క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం.
–క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్ గా కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆయన తెలంగాణ సీఎస్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాట్ ఉత్తర్వులపై 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది.
క్యాట్ ఉత్తర్వులపై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ ఈ కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో సీఎస్ గా కొనసాగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పు కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్ళిపోవాలని సూచించింది. ఇందుకు మూడు వారాల సమయం కావాలని సోమేశ్ కుమార్ తరుఫు న్యాయవాది అభ్యర్థించగా.. వారి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్ళాలని ఆదేశించింది. అయితే, హైకోర్టు తీర్పుపై సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించారు. ఏపీ క్యాడర్ కు చెందిన వ్యక్తికి తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు ఎలా అప్పగిస్తారని న్యాయస్థానాల్లోనూ పిటిషన్ దాఖలు చేశారు. చట్ట విరుద్దంగా సోమేశ్ కుమార్ కు సీఎస్ పోస్టింగ్ కట్టబెట్టారని సోమేశ్ ను నియమించిన నాటి నుంచే రేవంత్ చెప్తూ వస్తున్నారు. బిహారీ మూలలున్న కేసీఆర్ అదే బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ కుమార్ కు తన ప్రభుత్వంలో కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించాడని పేర్కొన్నారు.
Also Read : మాణిక్ రావు చాలా హార్డ్ గురూ.. సీనియర్లు జర భద్రం..!