వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ ఆయన ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా కొట్టివేసింది. దీంతో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని అవినాష్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సీబీఐకి లైన్ క్లియర్ అయినట్లు అయింది. మూడు రోజుల కిందట తీర్పు రిజర్ చేసిన హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది.
ఇటీవల హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచటంతో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయం లేకుండా పోయింది. అందుకే గురువారం విచారణకు డుమ్మా కొటారు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా… తాను బిజీగా ఉన్నానని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆయన విచారణకు వెళ్ళాల్సి ఉంది. విచారణకు పిలిచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read : ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య – సునీత సంచలన ఆరోపణలు
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నామని గతంలోనే హైకోర్టుకే సీబీఐ తెలిపింది. ఇలాంటి సమయంలో దర్యాప్తు అధికారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా కొట్టివేసింది హైకోర్టు. దీంతో ఆయన అరెస్ట్ కు మార్గం సుగమమైంది.
Also Read : జగన్ ను ‘ఛీ’ కొడుతున్న పులివెందుల – ఇదిగో సాక్ష్యం