టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పై ఆయన భార్య పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు. పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘అలా మొదలైంది’ అనే టాక్ షో లో పల్లవి- నిఖిల్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ ఈ యంగ్ కపుల్స్ ను పలు ప్రశ్నలను అడిగి ఆసక్తికర సమాధానాలను రాబట్టారు.
మొదటి ప్రశ్నతోనే నిఖిల్ ను అడ్డంగా ఇరికించాడు వెన్నెల కిషోర్. పల్లవి పేరెంట్స్ అంటే మీ అత్త, మామల పేర్లు ఏంటో చెప్పాలని అడిగాడు. కానీ వారి పేర్లను చెప్పలేక ఇబ్బంది పడ్డాడు నిఖిల్. పెళ్లి అయింది. ఇంకా వాళ్ళతో ఏం పనుంది.? వారి పేర్లను గుర్తుంచుకోవడానికి అంటూ నిఖిల్ భార్య పల్లవి తన భర్త గాలి తీసింది.
అనంతరం మీ లవ్ స్టొరీ చెప్పాలని వెన్నెల కిషోర్ కోరగా… పేరెంట్స్ కు చెప్పిన లవ్ స్టొరీ చెప్పాలా.? రియల్ లవ్ స్టొరీ చెప్పాలా అంటూ నిఖిల్ ప్రశ్నించాడు. దాంతో నిజమైన లవ్ స్టొరీనే చెప్పాలని వెన్నెల కిషోర్ కోరగా…మా పేరెంట్స్ ఈ షో చూస్తారేమో అని నిఖిల్ అన్నారు. పరవాలేదు వారు నీ షో చూడలేరు అంటూ చెప్పుకొచ్చారు.
ఆ తరువాత వారి లవ్ స్టొరీని పల్లవి రివీల్ చేసింది. నాకు శాడ్ స్టోరీస్ చెప్పి లైన్ లో పెట్టాడు. పాపం ఇతనికి ఇన్ని బాధలు ఉన్నాయా..? అని ఫీల్ అయి లవ్ లో పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. తన ప్రేమను పొందేందుకు సింపతీ కార్డు వాడాడని షాకింగ్ కామెంట్స్ చేసింది పల్లవి.
Also Read : నీహారిక – చైతన్య విడాకుల న్యూస్ ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా..?