తెలంగాణలో మద్యం ధరలను అనూహ్యంగా తగ్గించేశారు కేసీఆర్. రాత్రికి రాత్రి మద్యం ధరలను తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుల్ బాటిల్ పై ఏకంగా 40రూపాయలు తగ్గించారు. బీర్ పై రూపాయి కూడా తగ్గించలేదు. మద్యం ధరలను తగ్గించాలని సర్కార్ కు హటాత్తుగా ఆలోచన ఎందుకొచ్చిందని సర్వత్ర చర్చ జరుగుతోంది.
సమ్మర్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇంకా మద్యం అమ్మకాలు జోరందుకోలేదు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో సర్కార్ కు ఆదాయం తగ్గిపోయింది. దీంతో ధరలు తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయనే కార్పోరేట్ సూత్రాన్ని అమలు చేసింది బీఆర్ఎస్ సర్కార్.
తెలంగాణ సర్కార్ కు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలే. ఇప్పుడు ఈ అమ్మకాలు పడిపోవడంతో ప్రభుత్వాన్నికొచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. దీంతో సమయానికి సర్కార్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. పైగా ఈ ఏడాది ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎక్కువ ఖర్చులు ఉంటాయి. అందుకే మద్యం ధరలు తగ్గించడం రెండు విధాలా ఉపయుక్తంగా ఉంటుందని సర్కార్ అంచనా వేసినట్లు కనబడుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ప్రవాహం ఎలా సాగిందో చూస్తే ఈసారి ఎన్నికల్లో మద్యం హవా ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. కేవలం మునుగోడు నియోజకవర్గంలోనే 300వందల కోట్ల మద్యం అధికారికంగా అమ్ముడైంది. అనధికారికంగా ఎంత అమ్ముడైందో లెక్కే లేదు. అందుకే ధరలు తగ్గిస్తే మద్యం ప్రవాహం మరింత పెరిగి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.