సాఫ్ట్ వేర్ దంపతులకు ఆరేళ్ళ కొడుకు. తను ఉన్నట్టుండి జబ్బు బారిన పడటంతో వైద్యులకు చూపించారు. పరీక్షలు చేయగా మెదడు కేన్సర్ అని తేల్చేశారు. ఆరేళ్ళ కొడుక్కి ఈ విషయం అర్థం అవుతుందో లేదో తల్లిదండ్రులకు తెలియదు. కాని ఈ విషయం బిడ్డకు తెలియకుండా ఆ జంట జాగ్రతపడాలనుకున్నారు. బిడ్డను చూస్తున్న ప్రతిసారి మెదక్ కేన్సర్ అనే విషయం గుర్తొచ్చినా తనకు విషయం చెప్పకుండా లోలోపల తల్లిదండ్రులు కుమిలిపోయారు. చిన్న కన్నీటిచుక్క కూడా బయటపడకుండావ్యవహరించారు.
కాని అసలు విషయం వాళ్లకు తెలియదు. డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు చూసి తనకు ఏమైందో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకున్నాడు. ఆరేళ్ళ పిల్లాడు తనకు ఏమైందో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకోవడం ఏమాత్రం ఆషామాషీ విషయం కాదు. అయితే.. కన్నీరు పెట్టించే విషయం ఏంటంటే… సాధారణంగా రోగులకు వ్యాధి గురించి చెప్పకండి. వారు ఆందోళన చెంది తొందరగా కాలం చేస్తారని రోగుల సంబంధీకులకు వైద్యులు సూచిస్తుంటారు. కాని ఇక్కడ మాత్రం భిన్నంగా జరిగింది.
ఆ పిల్లాడు తన కేన్సర్ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియదనుకున్నాడు. విషయం తెలియకుండా చూడాలనుకున్నాడు. నేను చేనిపోయేదాక తనకు మెదడు కేన్సర్ అని మా పేరెంట్స్ కు చెప్పకండి. మా పేరెంట్స్ కు విషయం తెలిస్తే తట్టుకోలేరని వైద్యులకు చెప్పడంతో వైద్యులే ఆశ్చర్యపోయారు. అంత చిన్న వయస్సులో ఎంత గొప్ప ఆలోచన ఆ పిల్లాడిది. ఇక తమ కుమారుడికి అసలు విషయం తెలియదని తల్లిదండ్రులు అనుకున్నారు. తల్లిదండ్రులకు విషయం తెలియదని పిల్లాడు అనుకున్నాడు. ఇద్దరు కడుపులోనే దుఃఖాన్ని దాచుకొని పైకి నవ్వుతు కనిపించారు.
మరో డాక్టర్ దగ్గరకు కొడుకుని తీసుకెళ్ళేటప్పుడు పేరెంట్స్ కు కూడా అర్దమైంది. ఇక మా కొడుకు మరెంతో కాలం బ్రతకడని. పిల్లాడిని ఉన్నాన్నాల్లు హ్యాపీగా చూసుకోవాలనుకున్నారు.ఉద్యోగాలకు రాజీనామాలు చేసేసి ఉన్నదంతా కొడుకు కోసం ఖర్చు పెట్టాలనున్నారు. పిల్లాడి ఆనందమే మహాఆనందంగా బ్రతికారు. కొన్నాళ్ళ తరువాత వారి కొడుకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు.
సదరు డాక్టర్ ను తల్లిదండ్రులు కలిసినప్పుడు అసలు విషయం చెప్పాడు. మీ కొడుకుకు తనకు మెదడు కేన్సర్ అని తెలుసు. గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకున్నాడు. మీకు అసలు విషయం చెప్పొద్దని చెప్పాడు. మీరు కూడా ఏమి తెలియనట్టే నటించండని ఆ పిల్లాడి తల్లిదండ్రులకు వైద్యుడు చెప్పడంతో వారిని కన్నీటిసంద్రం ముంచెత్తింది. వారు కూడా ఆ పిల్లాడితో ఏమి తెలియనట్లే ఉంటారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఎనిమిది నెలల తరువాత చనిపోవడంతో వారి కన్నీటిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఆ పిల్లాడి వయసు ఎంత..? ఆరేళ్ళు. ఆరేళ్ళలో అతని మేధస్సు ఎంత పరిపక్వత చెందింది చూడండి. ఈ స్టొరీ చదువుతుంటే మనకే అప్రయత్నంగా కన్నీటిచుక్కలు చెక్కిలిపై జారిపోతున్నాయి కదూ..!