ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్న వారి వయస్సు ఏమంత పెద్దది కూడా కాదు. కేవలం 20 నుంచి 40ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఒకప్పుడు గుండెపోటు అనేది 70ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనిపించేది కాని, ప్రస్తుతం స్కూల్ పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు హాయిగా కనిపించిన వ్యక్తులు అంతలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల ఓ కుర్రాడు ఓ పెళ్లి వేడుకలో సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు. అతను కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించి ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆకస్మికంగా వస్తుంది. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడే కార్డియాక్ అరెస్ట్ కు కారణం. దీని వలన గుండె కొట్టుకోవడంలో వ్యత్యాసం ఏర్పడుతుంది. తద్వారా గుండెకు రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యంపై ప్రభావం చూపిస్తుంది. మెదడు, గుండె శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఈ సమయంలో సీపీఆర్ చేస్తే ప్రయోజనం ఉంటుంది
కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటు ఒకటేనా..?
ఈ అంశంలో అందరూ పోరబడుతుంటారు. కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు అనేది వేర్వేరు. రక్తనాళంలో క్లాట్ ఏర్పడినప్పుడు గుండె కండరాల వరకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పుతుంది. దాంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ సమయంలో గుండెలో తీవ్రమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు ఈ తరహ లక్షణాలు బలహీనంగా కనిపిస్తాయి కూడా. ఈ సమయంలో రోగి స్పృహలోనే ఉంటారు. ఇది గుండెపోటుకు సంకేతం. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు గుండె వెంటనే రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. అందుకే కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తి క్షణకాలంలో స్పృహ కోల్పోతాడు.
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ముప్పు తప్పించుకోవాలంటే వ్యాయామం చేయలంటున్నారు వైద్య నిపుణులు. అలా చేయడం వలన ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయని అంటున్నారు. అయితే.. జిమ్ లో ఎక్కువగా వర్కౌట్ చేయవద్దని సూచిస్తున్నారు. వ్యాయామం చేసిన తరువాత కూడా చిల్ అయ్యేందుకు కాస్త సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఎక్కువగా ఆందోళన చెందటం మంచిది కాదని.. ప్రశాంతంగా ఉండేందుకు యోగ చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం కారణంగా హృదయ రోగాల బారినుంచి బయట పడవచ్చని వైద్యులు అంటున్నారు.
Also Read : చిన్న వయస్సులో గుండెపోటుకు ఇదేనా కారణం..?