స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు విభాగానికి ముఖ్య అధికారిగా ఉన్న ఎ.ఆర్. శ్రీనివాస్ అనే ఐ.పీ.ఎస్ అధికారి సిట్ కు అనర్హుడని, కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజుల జైలు శిక్ష, జరిమాన పడ్డ అధికారికి ఇంత తీవ్రమైన టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ కేసును ఎలా అప్పగించారని? కాంగ్రెస్ లీడర్, సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే శుక్రవారం హై కోర్ట్ ఈ కేసు పూర్వపరాలను పరిశీలించింది. ఎ.ఆర్.శ్రీనివాస్ పేపర్ లీక్ కుంబకోణం లో ఎలాంటి పక్షపాత దొరణి లేకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు చేశారు. వాటిని సీల్డ్ కవర్లో పెట్టి ఈ మద్యే హైకోర్ట్ కు సమర్పించారు. వాటిని పరిశీలించిన జెస్టిస్ ఆ దర్యాప్తు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎ.ఆర్. శ్రీనివాస్ పనితీరును మెచ్చుకుని క్లీన్ చీట్ ఇచ్చారు జెస్టిస్.
అంతేకాకుండా ఈ కేసును సిబిఐ కి అప్పగించాలి అనే కొందరి వాదనలను కూడా జెస్టిస్ తోసిపుచ్చారు. ఈ కేసు నిగ్గు తేల్చడానికి సిట్ ముఖ్య అధికారిగా ఎ.ఆర్. శ్రీనివాస్ తగిన వ్యక్తీ అని కోర్ట్ నమ్ముతున్నట్లు చెప్పారు. దీనితో ఎ.ఆర్. శ్రీనివాస్ మీద ఉన్న కొన్ని ఆరోపణలకు ముగింపు కార్డ్ పడినట్లు అయ్యింది. ఇక ఈ కేసు సాఫీగా సాగటానికి మార్గం సుగమం అయ్యింది.
తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలలో ఆడుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.ఎస్.పి.ఎస్సి) పాలకమండలి నిర్లక్ష్య వ్యవహారంపై యావత్ తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతోంది. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన నేరస్తుల భరతం పట్టాలని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో కోరుకుంటుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన పేపర్ల లీకేజీ కుట్రలో పాలుపంచుకున్న నేరస్తులందరికీ కఠినమైన శిక్షలు పడేంతవరకు విశ్రమించేది లేదని విపక్ష రాజకీయ పార్టీలు నడుం బిగించాయి. యూనివర్సిటీల విద్యార్థులంతా మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇంత తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితుల్లో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తాపీగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తుకు అప్పగించి మౌనం దాల్చింది అనే ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి.
కానీ అవన్నీ పునాదులు లేని ఆరోపణలు అని హై కోర్ట్ తేల్చడంతో తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగులకు కలిగింది. వీళ్ళు తమ ఆశలన్నీ సిట్ ఉన్నత అధికారి ఎ.ఆర్.శ్రీనివాస్ మీదే పెట్టుకున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.