అధికారం పోయినప్పటి నుంచి ఆగం ఆగం అవుతున్న గులాబీ పార్టీ నేతలకు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువై పోయాయి. పార్టీలో ఆధిపత్యం కోసం నాలుగు వర్గాలుగా ఏర్పడి కొట్టుకుంటున్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులు…బయటకు సఖ్యతగా కనిపిస్తున్నప్పటికీ..లోపల మాత్రం కుట్రలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే భారత జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకొని రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మిగిలిన కేటీఆర్, హరీష్ రావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఫార్ములా ఈ కార్ స్కామ్ లో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో హరీష్ రావు వర్గం లోలోపల చాలా సంతోషంగా ఉందంట. అయితే ఫార్ములా ఈ కార్ స్కామ్ తో పాటూ కేటీఆర్ చేసిన అరాచకాలన్నీ తెలిసిన హరీష్ రావు వాటి బంఢారం కూడా బయట పడితే బాగుండు అని అనుకుంటున్నారట. ఇందుకోసం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు.
ఒకవైపు ఫార్ములా ఈ కార్ స్కామ్ లో కేటీఆర్ ను ఏ-1గా చేర్చిన గంటల వ్యవధిలోనే..కేటీఆర్ చుట్టూ మరో కేసు చుట్టు ముట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల విషయంలో సిట్ విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై విచారణ పూర్తయితే కేటీఆర్ చేసిన భారీ ఆర్ధిక నేరం బయటపడుతుంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి పూర్తి విషయాలు హరీష్ రావుకు తెలుసు. ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగింది. దీంతో ఇందులో కేటీఆర్ ను ఎలాగైనా ఇరికించాలనుకున్నారు హరీష్ రావు. ఫార్ములా ఈ కార్ స్కామ్ హడావుడిలో ఉండగానే అసెంబ్లీ వేదికగా కేటీఆర్ ను అడ్డంగా బుక్ చేశారు. విచారణకు ఆదేశిస్తే కేటీఆర్ ఇరుక్కుంటారని తెలుసు కాబట్టి…కావాలని దీనిపై సవాల్ విసిరారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇలా తనకు అడ్డుగా ఉన్న కేటీఆర్ ను తన చేతికి మట్టి అంటకుండా తొలగించుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేశారు హరీష్ రావు.