నవీన్ ను అతికిరాతకంగా హత్య చేసిన హరిహరకృష్ణ పోలీసు కస్టడీలో పలు వివరాలు వెల్లడించాడు. నవీన్ పరిచయం మొదలు అతనిని హత్య చేసే వరకు జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా వివరించాడు. పోలీసు కస్టడీలో హరిహరకృష్ణ ఏం చెప్పాడో అతని మాటల్లోనే చూద్దాం.
నేను 2017-19లో ఇంటర్ దిల్ సుఖ్ నగర్ లోని ఐడియల్ జూనియర్ కాలేజ్ లో చదివాను. నా ఇంటర్ సెకండియర్ సమయంలో నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ మహాత్మా గాంధీ వర్సిటీలో, నేను అరోరా ఇంజినీరింగ్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. మాకున్న పరిచయంతో అప్పుడప్పుడు ఇద్దరం కలుసుకునేవాళ్ళం. నవీన్ కు నిహారిక పరిచయమయ్యాక వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు ఈ విషయాలను నాతో చెప్పేవారు. ఈ క్రమంలోనే నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నట్లు నిహారిక నాతో చెప్పింది. ఆ విషయంలో మనస్తాపం చెంది నవీన్ తో మాట్లాడటం బంద్ చేసింది నిహారిక.
నిహారిక అంటే నాకు చాలా ఇష్టం. నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని నిహారిక అతని దూరం పెట్టడంతో వారిద్దరూ విడిపోయారు. దాంతో నేను 9నెలల కిందట నిహారికను ప్రేమిస్తున్నట్లు ఆమెకు చెప్పాను. ఆమె కూడా అందుకు అంగీకరించింది. అప్పటి నుంచి మా ప్రేమ కొనసాగుతోంది. అయినప్పటికీ నిహారికకు అప్పుడప్పుడు నవీన్ కు మెసేజ్ , కాల్స్ చేసి ఇబ్బందిపెట్టేవాడు. ఆ కోపంతో నవీన్ ను చంపాలని మూడు నెలల కిందట ఫిక్స్ అయ్యాను. రెండు నెలల కిందట నవీన్ ను చంపేందుకు కత్తి కొన్నాను. మర్డర్ చేసే సమయంలో నా వేలిముద్రల పడకుండా రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. వాటిని ఎవరి కంట కనిపించకుండా మా ఇంట్లో భద్రంగా దాచి పెట్టాను.,
జనవరి 16 న మా ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాము. కుదిరితే అదే రోజు నవీన్ ను హత్య చేయాలని అనుకున్నా. కానీ .. ఆ రోజు అందరూ కలవడానికి కుదురలేదు. ఫిబ్రవరి 17 న ఉదయం 9 గంటలకు నవీన్ నాకు కాల్ చేసి.. హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. మరో ఫ్రెండ్ తో కలిసి ఎల్బీ నగర్ లోనున్న నవీన్ ను పికప్ చేసుకున్నాం. ముగ్గురం నాగోల్ లో భోజనం చేశాక.. నా ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను , నవీన్ మలక్ పేట్ లోని మా ఇంటికి వెళ్లాం. ఆ రోజు రాత్రి నవీన్ హాస్టల్ కు వెళ్తానంటే.. నేను వస్తానని చెప్పాను. అప్పుడే నవీన్ ను చంపేందుకు మంచి సమయమని అనుకున్నా. దాంతో సజ్జమీద దాచిన బ్యాగ్ ను తీసుకున్నా. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్తుండగా…అవుటర్ రింగ్ రోడ్డు దాటగానే..ఈ టైంలో అంత దూరం వద్దని చెప్పి కలిసి మందు తాగాం. అనంతరం నిహారిక గురించి నీకో విషయం చెప్పాలని నవీన్ తో అన్నాను. ఏంటో చెప్పమని నవీన్ అడగటంతో కొంత దూరం వెళ్ళాక చెప్తానని అతనిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళాను.
నేను నిహారికను ప్రేమిస్తున్నానని అసలు విషయం నవీన్ తో చెప్పాను. ఇక నుంచి ఫోన్ చేసి నిహారికను ఇబ్బంది పెట్టకు అని అనగానే.. ఆగ్రహంతో నవీన్ నన్ను కొట్టాడు. అప్పటికే నవీన్ ను చంపాలనుకున్న నేను.. నవీన్ ను బలంగా కొట్టి.. గొంతు నులిమి చంపేశాను. ఆ తరువాత నా బ్యాగులో ఉన్న కత్తితో కోపంతో చాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు అడ్డం పొడుగు కోసేసి.. అతని గుండెను శరీరం నుంచి వేరు చేసి.. మర్మాంగాన్ని కోసేశాను. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేసాను. ఆ తర్వాత నవీన్ శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. అతని సెల్ ఫోన్ ని రోడ్డు పక్కన పడేసాను. రక్తంతో ఉన్న నవీన్ శరీర భాగాలను దూరంగా.. రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసి బ్రాహ్మణపల్లిలో నేను నా ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్ళాను.
అక్కడికి వెళ్లి స్నానం చేసి నా బట్టలకు బదులు బాత్రూంలోని హసన్ బట్టలు వేసుకున్నాను. నేను విడిచి బాత్రూంలో దాచిన బట్టలు ఎందుకు వేసుకున్నావని హసన్ అడిగితే.. నవీన్ ను చంపిన విషయం చెప్పాను. అప్పుడు హసన్ ఎందుకిలా చేశావని.. వెంటనే పోలీసులకు లొంగిపోమని చెప్పాడు. ఉదయమే వెళ్తానని చెప్పి రాత్రి అక్కడే పడుకున్నా. మరుసటి రోజు ఉదయం నిహారికకు ఫోన్ చేసి ఆమెను కలిసాను. ఆమెతో కూడా నవీన్ ను చంపినట్లు చెప్పాను. దాంతో ఆమె ఎందుకిలా చేశావని తిట్టింది. ఆ తరువాత కొద్ది రోజులకు పోలిసుల ముందు లొంగి పోయానని చెప్పాడు.