క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఆయనను ఎక్కడికి.. ఎవరు తీసుకెళ్లారో స్పష్టత ఇవ్వలేదు. మఫ్టీలో వచ్చిన పోలీసులే మల్లన్నను తీసుకెళ్ళారని తరువాత స్పష్టత వచ్చింది. 24గంటల తరువాత పోలీసులు మల్లన్నను కోర్టులో ప్రవేశపెట్టారు. భర్తకు ఏమైందో తెలియక తీన్మార్ మల్లన్న భార్య పోలీసు స్టేషన్ ల చుట్టూ తిరిగింది. ఇద్దరు చంటి బిడ్డలను ఏసుకొని పోలిసులు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్లి తన భర్త ఎక్కడున్నాడో వివరాలు తెలుసుకుంది. పోలీసులు తప్పుడు వివరాలు చెప్పడంతో మల్లన్న భార్య మూడు పోలిసుల స్టేషన్ల చుట్టూ తిరిగినట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలోనే తన భార్యను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ మల్లన్న భార్య మమత రాజ్ భవన్ కు వెళ్ళారు. అక్కడ గవర్నర్ తమిళిసై ను కలిశారు. ఈ సందర్భంగా మమత వద్దనున్న పాపను చూసి గవర్నర్ చలించిపోయారు. చిన్న పాప ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. పాపను తన దగ్గరికి తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని కాసేపు లాలించారు. పాపకు ఏమైందని అడిగి కన్నీళ్లు పెట్టుకున్నారు. పాపకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
తీన్మార్ మల్లన్నకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారని మమత రాజ్ భవన్ లో ఫిర్యాదు చేశారు. మల్లన్న లేకుండా పాప ఉండదని.. ప్రతిరోజు నాన్న అంటూ కలవరిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. మల్లన్న కూడా పాపను చూడకుండా ఉండలేరని చెప్పారు. పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకున్న గవర్నర్… డాక్టర్ గా పాపకు మెరుగైన వైద్యం కోసం సలహాలు, సూచనలు చేశారు.
తీన్మార్ మల్లన్న కూతురు మొదటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. అందుకే పాపను కంటికి రెప్పలా చూసుకుంటారు మల్లన్న. గతంలోనూ మల్లన్నను అరెస్ట్ చేసినప్పుడు పాప బెంగ పెట్టుకుందని దాంతో తీవ్ర అనారోగ్యానికి పాప గురైనట్లు చెప్పారు మమత.
ఇప్పుడు కూడా మల్లన్నను పదేపదే కలవరిస్తుందని…డాడీ వచ్చేవరకు అన్నం తిననంటూ మారం చేస్తుందని కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న భార్యను ఓదార్చిన గవర్నర్… మల్లన్న విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా మల్లన్న కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకొని లాలించడం అందర్నీ ఆకర్షిస్తోంది.