టాలీవుడ్ యంగ్ డైరక్టర్ లలో గోపీచంద్ మలినేని ఒకరు. తన వరుస సినిమాలు సూపర్ హిట్ టాక్ అందుకుంటుండంతో స్టార్ డైరక్టర్ జాబితాలో చేరిపోయరాయన.
రవితేజ హీరోగా నటించిన ‘డాన్ శ్రీను’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమైనా గోపీచంద్ ఆ తర్వాత బాడీ గార్డ్ , విన్నర్ , క్రాక్ ,బలుపు , పండగ చేస్కో , వీర సింహా రెడ్డి వంటి సినిమాలను తెరకెక్కించారు.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన డాన్ శ్రీను , బలుపు , క్రాక్ మరియు వీర సింహా రెడ్డి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో మూడు సినిమాలు స్టార్ కిడ్ శృతి హసన్ తో చేశారు. ఈ సినిమాలన్నీ హిట్ టాక్ అందుకున్నాయి.
శృతి హసన్ కథానాయికగా గోపీచంద్ తెరకేక్కిన్చినియా సినిమాలన్నీ హిట్ కావడంతో వీరి కాంబో సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ వీడియో వైరల్ అయింది.
గోపీచంద్ మలినేని లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి మూవీ విడుదలకి ముందు జరిగిన ప్రొమోషన్స్ లో శృతి హాసన్ కి అందరి ముందు ‘ఐ లవ్ యూ’ చెప్తాడు. దాంతో ఒక్కరిగా వీళ్లిద్దరి మధ్య ఎదో ఉన్నట్టు మీమ్స్ వైరల్ అయ్యాయి.
ఈ విషయమై గోపీచంద్ మలినేని తాజాగా స్పష్టత ఇచ్చారు.‘శృతి హాసన్ కి నాకు మధ్య ఉన్నది అన్నా చెల్లి అనుబంధం. నేను ఆ ఉద్దేశ్యంతోనే ఆమెకి ఐ లవ్ యూ చెప్పాను. కానీ సోషల్ మీడియా లో ఉన్న గాసిప్ రాయుళ్లు దానిని వేరే ఉద్దేశ్యం తో ఉన్నట్టు మార్చి మీమ్స్ చేసారని చెప్పుకొచ్చారు.
తమ మధ్య అనుబంధం గురించి సోషల్ మీడియాలో పోస్టింగులు చూసి నేను శృతి హాసన్ బాగా నవ్వుకున్నామని’ సమాధానం చెప్పాడు.