టీఎస్ పీస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. లీక్ అయినట్లు గుర్తించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. టీఎస్ పీస్సీ నిర్ణయంతో క్వాలిఫై అయిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు పరీక్షలను రద్దు చేయడంతో కష్టపడి చదివిన తమ పరిస్థితి ఏంటని క్వాలిఫ్ అయిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. దాంతో సర్కార్ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. టీఎస్ పీస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ , హరీష్ లు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ మంత్రులతో చర్చించారు.
పరీక్షల రద్దుతో కొంతమంది శాంతించగా..క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. పేపర్లు లీక్ అవ్వడం వలన రద్దైన నాలుగు పరీక్షలను త్వరలోనే మళ్ళీ నిర్వహిస్తామని చెప్పారు కేటీఆర్.ఇందుకోసం అభ్యర్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
రద్దు అయిన నాలుగు పరీక్షలకు సంబందించిన కోచింగ్ మెటిరియల్ ను ఆన్ లైన్ లో ఉచితంగా ప్రవేశపెడుతామని తెలిపారు. అలాగే స్టడీ సెంటర్లలో రీడింగ్ రూమ్ లను 24గంటలు అందుబాటులో ఉంచుతామని…ఈ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఆందోళన చెందవద్దని సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read : Big Breaking : టీఎస్పీఎస్సీ రద్దు – కేసీఆర్ సంచలన నిర్ణయం !?