ఏపీ మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కొడుకు వార్తలెక్కారు. ఎదో పెద్ద ఘనకార్యం చేసి కాదు. ఓ అమ్మాయి విషయంలో ప్రత్యర్ధులతో గొడవ పెట్టుకొని వార్తల్లో నిలిచాడు. జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ లో రాత్రి గ్రూప్ వార్ జరిగింది. ఓ గ్రూప్ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ది కాగా.. మరో గ్రూప్ సిద్దార్థది. వీరి మధ్య ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది. పబ్ లో రెండు వర్గాలు ఎదురుపడటంతో బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో సిద్దార్థ్ వర్గం తీవ్రంగా గాయపడింది.
ఈ గొడవలో ఓ యువకుడి కన్నుకు తీవ్ర గాయం అయింది. డేవిడ్ సవాంగ్ పై సిద్దార్థ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితులు గౌతమ్ సవాంగ్ ను కలిసి జరిగిన విషయాన్నీ వివరించారు. పెద్ద మనిషి ఇద్దరినీ కూర్చోబెట్టి వివాదాన్ని సద్దుమణిగెలా చేస్తారని అనుకుంటే రివర్స్ లో వార్నింగ్ ఇచ్చారు. తన కుమారుడిపై ఫిర్యాదు చేసేందుకు నా దగ్గరికే వస్తారా..? బెదిరించి తిప్పి పంపించారు. ఈ క్రమంలోనే కొన్ని వాట్సప్ చాట్ లను బాధితులు బయటపెట్టడంతో విషయం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు కావడంతో గౌతమ్ సవాంగ్ బాధితులకు పవర్ ఫుల్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఘటన జరిగింది హైదరాబాద్ లో. ఏపీనే కాదు హైదరాబాద్ లోనూ తను పోలీసు ఆఫీసరేననే తరహాలో బెదిరించారు. బాధ్యతయుతమైన హోదాలో కొనసాగుతూ న్యాయం కోసం ఇంటి మెట్లు ఎక్కినా వారికీ నచ్చజెప్పి .. వివాదాన్ని సద్దుమణిగేలా చూసుకోవాల్సిన పెద్ద మనిషి.. ఇష్యూను మరింత పెద్దదిగా మార్చేసుకున్నారు.
Also Read : టీడీపీని నడిపించేది ఎవరు..? నందమూరి ఫ్యామిలీ..? నారా ఫ్యామిలీనా..?