తెలంగాణ బీజేపీ నేతల్లోనే కాదు…జాతీయ స్థాయి నేతల్లోనూ చీలికలు వచ్చాయి. ఏకంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మధ్య మునుపటిలా సఖ్యత లేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేంద్ర క్యాబినెట్ ను ప్రక్షాళన చేయాలని పార్టీ సుప్రీం లీడర్ అమిత్ షా , మరో కీలక నేత బీఎల్ సంతోష్ లు ప్రధాని మోడీకి రిపోర్ట్ ఇచ్చారు. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చాలని సూచించారు. ప్రధాని మాత్రం షా, బీఎల్ సంతోష్ ల సూచనను పక్కనపెట్టేశారు. కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనతో ఎన్నికలున్న రాష్ట్రాల్లో ఎంపీలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మోడీకి షా , బీఎల్ సంతోష్ లు చేసిన సూచన.
ప్రతిసారి ఈ ఇద్దరు నేతల సూచనలను అంగీకరించి వ్యవహారాలన్నింటిని మోడీ చక్కబెట్టేవారు కానీ కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తరువాత షా, బీఎల్ వ్యూహాలపై మోడీకి నమ్మకం సన్నగిల్లిందని అంటున్నారు. వారి సూచనతోనే కర్ణాటకలో ముఖ్యమంత్రులను మార్చి సీఎం పీఠం చేజార్చుకున్నామని భావనలో మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికలముంగిట ఈ ఇద్దరు నేతల సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తే ఎనికల్లో ఇబ్బందికర ఫలితాలు ఉంటాయని మోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీకి అమిత్ షా అంటే ఒక వ్యూహకర్త. అందుకే ఆయన సూచనలను ,వ్యూహాలను మోడీ గతంలో గుడ్డిగా ఫాలో అయ్యేవారు. కానీ ఇటీవల ఫలితం బెడిసికొట్టడం.. అందులో అమిత్ షా సూచనలే ప్రధాన కారణమని తేలడంతో వారిపై మోడీ విశ్వాసం కోల్పోయారు.వారి సూచనలను మోడీ పక్కనపెట్టడంతో అమిత్ షా , బీఎల్ సంతోష్ లు కూడా అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : బీఆర్ఎస్ కు మైలేజ్ – కాంగ్రెస్ లో గందరగోళానికి తెరలేపిన ఉత్తమ్…!!