శవాని పాడేమీద మోసుకెళ్ళు తున్నారు అంటే – దాని మీద చల్లే చిల్లర ఎరుకో, మరమరాలు ఏరుకుని తినమనే వాడిని ఏమనాలి? ఒక్క మాటలో బిజెపి నాయకులు అనాలి.
మొన్నటివరకు మోడీ రైతులకు నష్టం వాటిల్లే శాసనాలు తెచ్చి రైతులను రోడ్డున పడేశాడు. దేశ చరిత్రలోనే మొదటిసారిరైతులు మొత్తం ఒక్కటై దేశ వ్యాప్తంగా ఏడాదిన్నర ధర్నాలు చేశారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది రైతులు కూలీలుగా మారారు, కాకపోతే బిచ్చాగాలుగా మారారు. పచ్చగా ఉన్న దేశంలో కారు చిచ్చు రాగాలగానే మోడీ తన తోక ముడిచాడు. ఆ మంటల మీద నిల్లు చల్లలేదు. ఆకులతో కప్పారు.మోడీ తన తప్పు తెలుసుకున్నారు అని రైతులు సంతోషించారు.
కానీ కుక్కతోక వంకరల మోడీ మళ్ళి మొదటికి వచ్చాడు. తాను చెప్పదలిచిన రైతు వ్యతిరేక విధానాలను ఈసారి తన ఎం పి లతో మరోసారి చెప్పిస్తున్నారు. నష్టపోయిన రైతుల రుణాలను మాఫీ చేయడం వల్ల దేశానికి నష్టం వస్తోంది అని, రైతుల ముక్కు పిండి రుణాలు వసూలు చేస్తామని కర్ణాటక బిజెపి ఎం పి, ఆ పార్టీ యువ మోర్చ నాయకుడు తేజస్వి సూర్య తో చేపించారు.
బ్యాంకుల నుండి వేల కోట్లాది రూపాయలు తీసుకుని పంగనామం పెట్టిన పెద్దలను మోడీ వదిలేస్తాడు. లేదా విదేశాలకు వెళ్లి పారిపోయేలా చేస్తారు. కానీ పాస్ పోర్ట్ కూడా గతిలేని పేద రైతుల నుంచి ముక్కు పిండి, కాకపొతే గొంతు పిండి వసూలు చేస్తారా? బక్క చిక్కన రైతు మీదా మీ ప్రతాపం అని రైతులు నిలదీస్తున్నారు? అసలు రైతుల మీద మోడీ సర్కార్ ఎందుకిలా పగబట్టింది? ఎందుకిలా తరిమి తరిమి కొడుతోంది? వాళ్ళు చేసిన పాపం ఒక్కటే -మోడీకి ఓటు వేయడం. ఇక కాలమే దీనికి జవాబు చెప్పాలి.