ఐసీయూలోనున్న కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయన పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీ ఫామ్ లోకి వచ్చింది. ఇదే బీఆర్ఎస్ , బీజేపీలకు కంటగింపుగా మారింది. అందుకే పార్టీని చక్కదిద్దాలనుకున్న ప్రతిసారి రేవంత్ ప్రయత్నాలకు అడ్డం పడుతూనే ఉన్నారు. కోవర్ట్ ఆపరేషన్ తో రేవంత్ ను దెబ్బతీయాలనుకున్నారు కాని అది వర్కౌట్ అవ్వలేదు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ లు ప్లాన్ మార్చాయి. తమ కనుసన్నలో నడిచే యూట్యూబ్ ఛానెళ్ళు, పత్రికలతో రేవంత్ పై దుష్ప్రచారం చేయించారు. అందులో భాగమే రేవంత్ కొత్త పార్టీ అనే ప్రాపగండా.
తెలంగాణలో కొత్త పార్టీ పురుడోసుకుందని.. తెలంగాణ సామజిక కాంగ్రెస్ పార్టీ పేరిట రేవంత్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారని బీఆర్ఎస్ అనుకూల జర్నలిస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆ జర్నలిస్ట్ ను ప్రశ్నించి ఆధారాలు బయటపెట్టాలని ప్రశ్నించడంతో తప్పుడు సమాచారం వలెనే ఇదంతా జరిగిందని తరువాత స్పష్టత ఇచ్చారు. అయితే , ఇదేదో పొరపాటుగా జరిగినట్లు అనిపించడం లేదు. ఉద్దేశ్యపూర్వకంగానే జర్నలిస్ట్ శంకర్ పోస్ట్ చేసినట్లు కనబడుతోంది. ఎందుకంటే.. ఆల్రెడీ తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5నే రిజిస్ట్రేషన్ అయింది. ఈ వివరాలు కూడా ఉన్నాయి. కాని ఇవేవి పట్టించుకోకుండా సామజిక మాధ్యమాల్లో.. రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నట్లు పోస్ట్ చేశారంటే ఆయన ఉద్దేశ్యం ఏంటో స్పష్టం అవుతోంది. ఆయన వెనక బీఆర్ఎస్ హస్తం ఉండి ఉండొచ్చు. బీఆర్ఎస్ పై బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తే ఆ పార్టీ అధికార ప్రతినిధిలా చెలరేగిపోయే సదరు జర్నలిస్ట్ ఇప్పుడు రేవంత్ పై తప్పుడు పోస్ట్ చేశాడంటే.. ఆయనపై బీఆర్ఎస్ నేతల ఒత్తిడి ఉండొచ్చనన్న అనుమానం కల్గుతోంది.
ఇప్పటికే రేవంత్ కు సీనియర్ల పోటు ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ కు ఊపిరాడకుండా చేసి పీసీసీ పదవి నుంచి ఊడపీకాలని బీఆర్ఎస్ సైతం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రేవంత్ పై దుష్ప్రచారం చేయడమే మార్గమని రేవంత్ వ్యతిరేక వర్గం, బీఆర్ఎస్ లు అనుకోని ఉండొచ్చు. అందులో భాగమే .. బీఆర్ఎస్ భజన జర్నలిస్ట్ శంకర్ పోస్ట్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.