కొన్ని సినిమాల కథలు వాల్ పోస్టర్ చూస్తే తెలిసిపోతాయి. కొన్ని ట్రైలర్ లు చూస్తే ఆ సినిమాల కథలు తెలిసిపోతాయి. మరికొన్ని సినిమాల మొదటి సీన్ చూడగానే కథ తెలిసిపోతుంది. ఈ సినిమా వాల్ పోస్టర్ చూస్తే కథ ఏమిటో తెలిసిపోతుంది. చాలా పాత కథ. లోగడ ఇలాంటి కథతో, ఇలాంటి పాత్రతో బాలకృష్ణ ఓ సినిమా చేశారు. అది అస్సలు ఆడలేదు. దాదాపు అందరు హీరోలు ఇంలాంటి కథలు చేసి ‘రీల్లు’ కాల్చుకున్నవాళ్ళే. వెంకి నటించిన ఒక్క ‘శత్రువు’ మాత్రమే బాగా ఆడింది.
కథ ఏమిటంటే?
కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేసే రవీంద్ర (రవితేజ) రకరకాల వ్యక్తుల ముసుగులో హత్యలు చేస్తుంటాడు. తాను ముసుగుగా వాడుకున్న వ్యక్తులనే ఈ హత్యల్లో నేరస్తులుగా చిత్రీకరిస్తాడు. ఎలాంటి ఆధారం వదలకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతాడు. ఈ హత్యలన్నీ రవీంద్ర ఎందుకు చేస్తున్నాడు? అస్సలు ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులను ఈ హత్యల్లో నేరస్తులుగా ఎందుకు చిత్రీకరిస్తున్నాడు? అన్నదే మెయిన్ పాయింట్.
హారిక (మేఘా ఆకాష్) తన తండ్రి (సంపత్ రాజ్) ని ఓ మర్డర్ కేసులో ఎవరో ఇరికించారు అని కనక మహాలక్ష్మి దగ్గరకి వస్తుంది. కానీ హారిక ని చూసిన రవీంద్ర ఆమెని మొదటి చూపు లోనే ఇష్టపడి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును తీసుకుంటాడు. కానీ ఇక్కడనుంచి ఈ కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి.
మొత్తం ఐదుగురు కథనాయికలు. హీరోయిన్స్ కి హీరోకి లింక్ ఏమిటి? ఆ పాత్రలు ఏంటి? హత్యలు వరుసగా జరిగిపోతూ ఉంటాయి. హంతకుడు దొరుకుతాడా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాలి. అది కూడా మీకు చాలా ఓపిక్ ఉంటేనే.
కానీ హత్యలు ఎవరు చేస్తున్నారో చిన్న పిల్లడు కూడా చెప్పేస్తాడు. అది వేరే విషయం. హీరో విలన్ లాగా హత్యలు చేయడం అనే పాయింట్ కొన్ని తరాలుగా వస్తోంది. కృష్ణ చాలా సినిమాల్లో ఇలాంటి వేషాలు వేశారు. ఇప్పుడు ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబు కూడా నటించాడు. ఇలాంటి పాత కథలకు 100 శాతం కొత్త ట్రీట్మెంట్ కావాలి. కానీ అదే ఇక్కడ లోపించింది.
ప్లస్ పాయింట్ లు
సినిమాకు ఫోటోగ్రఫీ చాలా బాగా ఉంది. సంగీతం కూడా బాగుంది. రెండు పాటలు మేలోడితో వినసొంపుగా ఉన్నాయి. ఈ సినిమాకు ఆర్ ఆర్ ప్రాణం పోసింది. స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రాణం తీసాయి. చాలా చోట్లా చెవులు పగిలిపోయే ఎఫెక్ట్స్ లు ఇబ్బంది పెడతాయి. ఎడిటింగ్ బాగుంది.
మొదటి భాగంలో దర్శకుడు సుధీర్ వర్మ పనితనం ముద్దోస్తుంది. అతను రాసుకున్న స్క్రీప్లే బాగుంది. సీన్లు పాతగున్నా, లవ్ ట్రాక్ హాయిగా ఉన్నది. మాటలు కూడా బాగున్నాయి. కొన్ని పంచ్ లు పేలాయి. మరి కొన్ని పంచ్ లు నవ్వించాయి. కొన్ని పంచ్ లు కవ్వించాయి. మొదటి భాగం చూశాక రెండో భాగంలో కూడా ఒక మంచి సినిమాను చూడబోతున్నాము అనిపిస్తుంది.
మైనస్ పాయింట్ లు
పాత కథ కావడంవలన ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ఇట్టే పసిగాడతాడు. కొన్ని సీన్లు బాగానే ఉన్నప్పటికీ కొత్తదనం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం బోర్ గా ఉంది. హీరోయిన్ లు తమమ పరిదిలో బాగానే నటించినప్పటికీ హీరో రవితేజ మాత్రం చాలా రొటీన్గా నటించాడు. కొత్త టెక్నాలజీ వాడి మేకప్ బాగానే వేశారు. కానీ అతని నటనలో కొత్తదనం లేదు. ఆ ‘గోదావరి మాస్ స్లాంగ్’ లోంచి ఇంకా బయటపడలేదు. అతను వెస్నిన అన్ని పాత్రలు ఒకేలా నటిస్తాయి.
ఐదు పాత్రలలో ముఖం మార్చినంత మాత్రానా గొంతు మారదా? యాస మారదా? భాషా మారదా? నడక మారదా? కనీసం చూపు కూడా మారదా? అసలే ముసలితనం మీద పది, కళ్ళకింద క్యారిబ్యాగులు మొదలయ్యాయి. కేవలం ఓవర్ మేకప్ వేసుకుని గెటప్ మార్చితే సరిపోతుందా?
పాతా రోజుల్లో ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ లు దుబాయి షేక్ లాగా పిల్లి గెడ్డం పెట్టున్ని, చెంపకు పుట్టు మచ్చ పెట్టుకుని ”నీది లవర్ నాకీ బాగా పసంద్ వచ్చినాయ్. ఆ బుల్దా బుల్నికి రేట్ బోలో – హం పైసా ఇస్తాయ్” అనే డైలాగ్ చెపితే ఈలలు పడ్డాయి. విలన్ని మోసం చేస్తే అప్పట్లో గుడ్డిగా నమ్మేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. హీరో మారువేషం వేయగానే ”చాల్లేవయ్య. ఆక్షన్ తగ్గించు” అని ప్రేక్షకులు అరిచే రోజులు.
రవితేజ ఒక్కసారి ‘భారతీయుడు’, ‘దశావతారం’ సినిమాలు చూడాలి. కమల్ హాసన్ నటనలో చూపిన వైవిద్యం అంటే ఏమిటో ముందు నేర్చుకోవాలి. అందుకే కమల్ మహా నటుడు అయ్యాడు. ఆయన సాటి నటులకు ఫీజు తీసుకోని గురువు. ఇలాంటి బహు పాత్రలు పోషించేటప్పుడు రవితేజ లాంటి మాస్ హీరోలు తప్పక చూడాలి, ఏ పాత్రకు ఆ పాత్రకు తగిన విధంగా కొత్తగా నటించాలి. అన్ని పాత్రలకు రవితేజ ‘పంగ కాళ్ళు’ పెట్టుకుని నడవరం ఏమిటో? అప్పట్లో జగ్గయ్య అన్ని పాత్రలకు ‘క్యాట్ వాక్’ చేసేవాడు.
రీటింగ్
మొత్తం 5 పాయింట్లకు మేము ఇచ్చే రేటింగ్ 2 మాత్రమే.