పదో తరగతి పేపర్ లీక్ కేసు బీజేపీ నేతల మెడలకు చుట్టుకుంటుంది. పేపర్ లీక్ చేసింది బండి సంజయేనని ఈమేరకు ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు తాజాగా ఈటల రాజేందర్ కు నోటిసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈటలకు కూడా హిందీ ప్రశ్నా పత్రాన్ని ప్రశాంత్ షేర్ చేసినట్లు తేలడంతో ఆయనకు నోటిసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కమలాపూర్ లో పేపర్ లీకేజ్ పై ఈటల స్టేట్మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. పేపర్ లీక్ కు కేంద్రంగా హుజురాబాద్ నియోజకవర్గాన్నే కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచే ప్రశ్నాపత్రం బయటకొచ్చిందని గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఈటల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ప్రశాంత్ మాజీ జర్నలిస్ట్ కావడంతో గతంలో నుంచే ఈటలకు ప్రశాంత్ టచ్ లో ఉన్నాడా…? బండి సంజయ్ తరహాలోనే ఈటల కూడా ప్రశాంత్ తో ఏమైనా చాట్ చేశాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో ఈటలకు పోలీసులు నోటిసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈటలతోపాటు ఆయన పీఏకు కూడా వరంగల్ పోలీసులు నోటిసులు ఇచ్చారు. హిందీ క్వశ్చన్ పేపర్ ను ఈటలతోపాటు ఆయన పీఏ కు కూడా పంపించినట్లు తేలడంతో పోలీసులు నోటిసులు ఇచ్చారు. మరి పోలిసుల నోటిసులకు ఈటల ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.
Also Read : టెన్త్ పేపర్ లీక్ వెనక బీజేపీ హస్తం..?