హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపును కేసీఆర్ పై విజయంగానే ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది. అందుకే ఈటలకు పార్టీలో పెద్దపీట వేయాలని నిర్ణయించింది. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్ గా పదవిని కట్టబెట్టింది.
ఈటలకు ఆయా పార్టీ నేతలతోనున్న సత్సంబంధాల వలన బీజేపీలోకి పెద్ద, పెద్ద నేతలను తీసుకొస్తారనుకున్నారు. ఈటల కూడా ఇదే అనుకున్నారు. కాని ఈటల తనవంతు ప్రయత్నాలు చేసినా.. కమలం కండువా కప్పుకునేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదు. కేసీఆర్ కోవర్టుల వలనే బీజేపీలోకి చేరికలు ఆగిపోయాయని ఈటల ఫీలవుతున్నారు.
బీజేపీలో చేరికల కమిటీని ఏర్పాటు చేయడం వలన ఆ పార్టీలో చేరాలనుకున్న నేతల పేర్లు ముందే లీకవుతున్నాయి. అందుకే బీజేపీతో టచ్ లోకి వచ్చేందుకు బీఆర్ఎస్ అసంతృప్తి నేతలెవరూ ఇంట్రెస్ట్ చూపడం లేదని ఈటల అవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో అసంతృప్తిగానున్న కీలక నేతలను బీజేపీలో చేర్చుకొని కేసీఆర్ ను చావుదెబ్బ కొట్టాలనుకున్న ఆ ప్రయత్నం ఫలించడం లేదు. అందుకు కారణం కోవర్టులేనని ఈటల పరోక్షంగా తెలియజేశారు.
దీంతో ఇప్పుడు అంత ఒకటే చర్చ. పార్టీలోని అంతర్గత సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారు…? పార్టీకి టచ్ లోకొచ్చిన నేతల పేర్లు బయటకు ఎలా లీక్ అవుతున్నాయి..? బీజేపీ చేరాలని అనుకుంటున్న నేతల పేర్లు కేసీఆర్ కు ఎలా చేరుతున్నాయి..?ఈ విషయాలను బీజేపీ ఆఫీసు నుంచి ప్రగతి భవన్ కు ఎవరు చేరవేస్తున్నారు..? అసలు బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఎవరు.? ఈటలను అడుగడుగునా అడ్డుకుంటున్న ఆ అదృశ్య శక్తులు ఏవి..? ఇప్పుడు వీటిపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : టి. బీజేపీలో సీఎం చైర్ కొట్లాట – డీకే అరుణ వర్సెస్ ఈటల