ఉన్నట్లుంది జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా మెత్తబడింది. దీనికి కారణం త్వరలో రాబోతున్న ఎం ఎల్ సి ఎన్నికలు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో చదువుకున్న ఉద్యోగుల ఓట్లు చాలా కీలకం. ఇప్పుడు ఏ మాత్రం బెట్టు చేసినా ఎన్నికలలో దారుణంగా ఓడిపోయే ప్రమాదం ఉందని జగన్ భయం. ఉద్యోగ సంఘాల ధీమా కూడా ఇదే. ఎన్నికల ముందు జగన్ తప్పక కాళ్ళ బేరానికి వస్తారని ఆశ. అందుకే ఇప్పటి వరకు సాగదీశారు.
చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు గతకొన్ని నెలలుగా చేసున్న ప్రధాన డిమాండ్లల్లో పాత బకాయిల చెల్లింపులు, సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ రద్దు) అంశాలు ప్రధానమైనవి. వీటికి జగన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఉద్యోగులు ‘తగ్గేదే లే’ అన్నట్లు ఆందోళనలు చేస్తున్నాయి. ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లు ఉంది పరిస్టితి.
జగన్ ముందుగా పావును కదుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిని రంగంలోకి దించారు. అయన ఈ రోజు ఉద్యోగులతో చాలా సున్నితంగా చర్చించారు. ఈ క్రమంలో ఈ నెల చివరి నుంచి సెప్టెంబరులోపు రూ. 3000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. మిగిలిన మొత్తం బకాయిలను కూడా త్వరలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. కానీ ఇంకా జివో విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేదు.
దీనికి తోడూ బీపీఎస్ అనే కొత్త స్కీమ్ ను తెరమీదికి కొత్తగా తెచ్చారు. అంటే బ్యాలెన్స్డ్ పింఛన్ స్కీమ్. ఇది ఉద్యోగులకు మేలు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగుల రియాక్షన్ గమనిచారు. కానీ కండి కండిషన్లు అప్లై అని కొత్త ఫిట్టింగ్ పెట్టారు. ”ప్రభుత్వం బాగుంటేనే ఉద్యోగులు బాగుంటారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంది” అని సీఎస్ చావు కబురు చల్లగా చెప్పారు.
అంటే ‘మీరు ఎం ఎల్ సి ఎన్నికలలో జగన్ మనుషులను ఎన్నుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి’ అని పరోక్షంగా హెచ్చరించారు. కానీ జగన్ని గెలిపిస్తేనే మీ డిమాండ్లు నెరవేరుస్తాను అని ఓ ప్రభుత్వ ఉద్యోగిగా ఆదేశించలేక పోయారు. గట్అటిగా చెప్దిపలేకపోయారు. అది ఎన్నికల నియమావళికి విరుద్దం.
అసలు ఇలాంటి ఎన్నికలల విషయాల్లో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఇలా జోక్యం చేసుకోరాదు. ఆ మాటకొస్తే అయన పరోక్షంగా ఇలా చెప్పడం కూడా సబబు కాదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల అంతరార్థంపైనే ఇప్పుడు ప్రతిపక్షాలు దృష్టి పెట్టాయి. ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. దీనిని తెలుగుదేశం పార్టీ తెలివిగా వాడుకోవాలని ఉద్యోగ సంఘాలను తమ వైపుకు తిప్పుకుంటోంది.
ఏది ఏమైనా ఇప్పుడున్న జగన్ ఎంఎల్సి అభ్యర్థులను ఎన్నుకుని బలిపశువులుగా మారే దౌర్భ్యాగం వచ్చింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాని ఎన్నికల కమిషన్ కు తీసుకెళ్ళే పని మొదలు పెట్టింది.