గురువారం ఉదయం సెల్ ఫోన్లన్నీ అలర్ట్ మెసేజ్ లతో ఒక్కసారిగా మోత మోగాయి. పెద్ద సౌండ్ తో ఈ అలర్ట్ మెసేజ్ లు రావడంతో మొబైల్ వినియోగదారులు బెంబేలేత్తిపోయారు. ఫోన్ పెలుతుందేమోనని కొంతమంది టెన్షన్ పడగా…ఎవరైనా ఫోన్ హ్యాక్ చేశారేమోనని మరికొందరు ఆందోళన చెందారు.
ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ గురించి కేంద్రం స్పందించింది. ఈ అలర్ట్ మెసేజ్ లతో ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో భద్రత దృష్ట్యా ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ ట్రయల్ రన్ చేశారని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇలాంటి అలర్ట్ మెసేజ్ పంపనున్నారు.
దీనిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించగా.. ఈరోజు పరీక్షించారు. పెద్ద సౌండ్‌తో కూడిన మెసేజ్ అందరికీ రావడంతో.. యూజర్లు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మెసేజ్ వచ్చింది.
Also Read : చిన్న వయస్సులో గుండెపోటుకు ఇదేనా కారణం..?