చిన్నారులపై అకృత్యాలు ఆగడం లేదు. ఎన్ని చట్టలు తీసుకొచ్చినా కామందుల్లో మార్పు రావడం లేదు. ముక్కు పచ్చలారని చిన్నారులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఎనిమిదేళ్ళ బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బొటాడ్లో భగవాన్పొరా ప్రాంతంలో సంక్రాంతి రోజున ఓ బాలిక తన ఇంటి పక్కన పడిన గాలిపటాన్ని తెచ్చుకునేందుకు సాయంత్రం సమయంలో బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక కోసం తల్లిదండ్రులు చుట్టు పక్కల అన్నింట్లో వెతికారు. మా పాప ఏమైనా కనిపించిందా అని తెలిసి వాళ్ళను అడిగారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు విస్తృతంగా గాలించారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కామందుల ధాటికి బలైందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని బాలిక కటుంబ సభ్యులతో పాటు స్థానికులుఒక చోట చేరి ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని బొటాడ్లోజరిగింది.