ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి ఇప్పటివరకు 11 మందిని ‘నిందితులు’, ‘అనుమానితులు’ అనే కేసులలో విచారణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మంది తాము నిర్దోషులము, మా మీది కేసు కొట్టివేయాలి అని కోర్టును ఆశ్రయించారు. అది సర్వసాధారణం. ‘నేను తప్పు చేసాను. కాబట్టి నన్నశిక్షించాలి’ అని ఎవ్వరూ కోరుకోరు. ఈడి కూడా దీనిని పెద్దగా పట్టించుకోదు.
మొన్న కవిత కూడా సుప్రీం కోర్ట్ కో ఇలాంటి కేసు వేసింది. కానీ ఈడి దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే సుప్రీం కోర్ట్ లో కవిత మీద ‘కేవియట్’ కేసు పెట్టింది. దీనిలో ఉన్న వెసులుబాటు ఏమిటంటే, ‘నిందితులు’, లేదా ‘అనుమానితులను’ ఈడి పిలిచినపుడు కార్యాలయానికి రాకపోతే వాళ్ళను అరెస్ట్ చేసి విచారించే హక్కు లభిస్తుంది.
కేవలం కవిత మీద ‘కేవియట్’ కేసు పెట్టడానికి బలమైంక కారణం ఈడి కి దొరికింది. ఆమె ఓసారి డుమ్మాకొట్టినా మొన్న మార్చ్ 11 న విచారణకు హాజరయ్యింది. మరోసారి మార్చ్ 16 న విచారణకు రావాలని ఈడి ఆదేశించింది. ఆమె సరే అని ఒప్పుకున్నప్పటికీ, కావాలని 16 రోజు మరోసారి డుమ్మా కొట్టి తన లాయర్ని పంపి ఓ చిన్న లాజిక్ తో ఈడి ని ఇబ్బందిపెట్టి కోపం తెప్పించింది. అందుకే సోమవారం, అంటే మర్చి 20 న రావాలని మరోసారి నోటీసు పంపింది ఈడి.
ఒక్కసారి విచారణకు వెళ్లిన కవితకు ఈడి అధికారులు 20 ఘాటు ప్రశ్నలు వేసి ఏసీ రూమ్ లోనే ఆమెకు ముచ్చెమటలు పట్టించారు. ఈసారి మరో 20 ప్రశ్నలు వేస్తే అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అవుతానని ఆమె భయం. అందుకే ఈసారి కూడా డుమ్మా కొట్టి ఆమె ఏకంగా మర్చి 24 న సుప్రీం కోర్ట్ కు హాజరు కావాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సూత్రదారి కెసిఆర్ అని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.
20 వ తేదీన కూడా కవిత విచారణకు రాకూడదు అని ఈడి కూడా వెయ్యి దేవుళ్ళకు మొక్కు కుంటోంది. అప్పడు ‘కేవియట్’ కేసు వంకతో ఆమెను అరెస్ట్ చేస్తారు. ఒకవేళ ఆమె బుద్దిగా వచ్చినా, మిగతా నిందితులతో కలిపి విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయి. అప్పుడు కూడా అరెస్ట్ చేస్తే అధికారం ఈడి కి ఉంది. అంటే ఇప్పుడు కవితకు ముందు నుయ్యి, వెంక గొయ్యి ఉంది. మరి రేపు ఎం చేస్తుందో చూడాలి. కెసిఆర్ ఏ చక్రం తిప్పుతాడో చూడాలి.