ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ప్రేమయం ఉందని ఈడీ ఆధారాలను సేకరించింది. ఢిల్లీ డిప్యుటీ సిఎం మనిష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ… కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ప్రస్తావించి ఆధారాలను బయటపెట్టింది. దీంతో త్వరలోనే ఈడీ నోటీసులను కవిత అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరికి నోటిసులు ఇచ్చి వారిని ఈడీ, సీబీఐలు విచారించాయి. కవితకు కూడా నోటిసులు అందుతాయని ప్రచారం జరిగింది. నోటిసులు అందకపోవడంతోపాటు చార్జీషీట్ లో కవిత పేరు ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కవితకు విముక్తి అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టులో ప్రోడ్యుస్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. అంతేకాదు.. పలు ఆధారాలను సేకరించింది.
సౌత్ గ్రూప్ నుంచి అమిత్ అరోరా ద్వారా వందల కోట్లను విజయ్ నాయర్ కు చేర్చారని ఈడీ తేల్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమిత్ అరోరా నుంచి సేకరించింది ఈడీ. ఈ వ్యవహారాన్ని శరత్ చంద్రారెడ్డి, కవిత సెట్ చేశారని, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కో ఆర్డినేట్ చేశాడని చెబుతోంది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఫోన్లను ఎప్పటికప్పుడు కవిత మార్చినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొంది.
కల్వకుంట్ల కవిత 2 నెంబర్లతో 10 ఫోన్లు వాడినట్లు ఆ ఫోన్ నెంబర్ల IMEI వివరాలతో సహా పేర్కొన్నారు. 6209999999 నెంబర్ తో 6 ఫోన్లు వాడిన కవిత ఆ 6 ఫోన్లను ధ్వంసం చేశారు. తరువాత 8985699999 నెంబర్ తో నాలుగు ఫోన్లు వాడిన కవిత ఆ 4 ఫోన్లు ధ్వంసం చేశారు. అంటే మొత్తం కవిత ఈ స్కాంలో 10 ఐఫోన్లను వాడినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ లో 36 మంది 170 ఐఫోన్లు వాడారని వీటి విలువ 1.38 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఈ 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లు చెబుతోంది. కవిత అనుచరుడు అభిషేక్ బోయినపల్లి 5 ఫోన్లు మార్చి ఆ ఐదింటిని ధ్వంసం చేశాడు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు 6 ఫోన్లు మార్చి ఆ ఆరింటిని ధ్వంసం చేశాడు. శరత్ చంద్రారెడ్డి 9 ఫోన్లు మార్చాడు ఆ 9 ధ్వంసం చేశాడు.
సౌత్ గ్రూప్ నుంచి కీలకంగా వ్యవహరించారని చెబుతున్నా శరత్ చంద్రను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక , ఇప్పుడు కవితకు కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉందని తేలాక ఆమెకు కూడా త్వరలోనే నోటిసులు అందటం ఖాయంగా కనిపిస్తోంది .