టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ శ్రీ నగర్ లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
గ్రానైట్ బిజినెస్ లో రవిచంద్రకు ప్రమేయముందని ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. బుధవారం మంత్రి గంగుల కమలార్ నివాసంతోపాటు హైదరాబాద్ , కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టింది.
టీఆర్ఎస్ కు చెందిన గంగుల , రవిచంద్ర ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరికీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడం ఆసక్తికరంగా మారింది. వెంటనే ప్రగతి భవన్ కు రావాలంటూ కేసీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని భావిస్తోన్న గులాబీ బాస్.. తదుపరి ఏం చేయాలన్న దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.