తెలంగాణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఒకేసారి ఈడీ నోటిసులు ఇష్యూ చేయడం సంచలనంగా మారింది. రోహిత్ రెడ్డితోపాటు రకుల్ ను కూడా ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ నోటిసులో పేర్కొన్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతంలోనే ఈడీ విచారణ జరిపింది. కాని రాష్ట్ర పోలిసుల నుంచి సహకారం అందలేదు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని చెప్పడం.. కోర్టులో సైతం అదే చెబుతూ చార్జీషీట్ దాఖలు చేయడంతో క్లీన్ చిట్ వచ్చింది. ఆ తరువాత డిజిటల్ ఎవిడెన్స్ పై ఈడీ హైకోర్టుకు వెళ్ళడం..అయినా వెనక్కి తగ్గకపోవడంతో కోర్టు ధిక్కరణ చర్యలు చేపడుతామన్న ఈడీ హెచ్చరికలతో ఆధారాలు ఇచ్చారు. అయితే, ఆల్ ఆఫ్ సడెన్ గా ఈడీ కూడా డ్రగ్స్ కేసులో సైలెంట్ ఐపోయింది. తాజాగాఈ కేసును వెలికి తీసి నోటిసులు ఇచ్చింది.
ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ వ్యూహాన్ని లీక్ చేశారని పైలెట్ రోహిత్ రెడ్డిపై బీజేపీపై పట్టలేనంత కోపముంది. అందులో భాగంగానే ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ ఇందులో ప్రమేయమున్న ఎవర్ని వదలబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు రీ ఓపెన్ అయింది. అయితే, పైలెట్ రోహిత్ రెడ్డికి నోటిసులు ఇవ్వడం కామన్ అనుకోవచ్చు కాని , రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా నోటిసులు ఇష్యూ చేయడం ఆసక్తికరంగా మారింది.
రకుల్ కు నోటిసులు ఇవ్వడం వెనక ఏదో మతలబు ఉందని.. ప్రభుత్వంలోని ఓ కీలక నేతకు ఉచ్చు బిగించేందుకు ఇలా చేసి ఉండొచ్చుననే అంటున్నారు.