ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవితకు మరోసారి ఈడీ నోటిసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో విచారణ మందగించింది అని వార్తలు వెలువడుతుండంతోపాటు బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే అరెస్ట్ నుంచి కవితకు ఉపశమనం లభించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటిసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముగిసిన అధ్యయనం అని ఇటీవల ప్రచారం జోరందుకుంది. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి, మా గుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిల్లి, బుచ్చిబాబులు అప్రూవర్లుగా మారారు. ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటిసులు ఇవ్వడంతో రేపు ఏం జరగబోతుంది..? అనే ఉత్కంట బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది.
ఈడీ నోటిసులపై కవిత ఇంకా స్పందించలేదు. నిజామాబాద్ పర్యటనలోనున్న ఆమె హైదరాబాద్ వచ్చాక ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. విచారణకు హాజరు అవుతారా..? ముందస్తు ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ఉన్నాయని గడువు కోరుతారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. బీజేపీ – బీఆర్ఎస్ ల క్విడ్ ప్రోకోలో భాగంగానే కవిత అరెస్ట్ నిలిచిపోయిందని కాంగ్రెస్ బలంగా వాదించింది. ఆ తరువాతే బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పతనం అవుతూ వస్తోంది.
ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ ను పెంచుకునే లక్ష్యంతో.. పార్టీపై వస్తోన్న ఆరోపణలను కొట్టివేసేందుకే కవితకు ఈ నోటిసులు వచ్చి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ కవితను విచారించి అరెస్ట్ చేయకుండా పక్కనపెట్టినా బీజేపీపై ఆదరణ పెరిగే అవకాశం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : లిక్కర్ స్కామ్ లో కదలిక – మోడీపై కవిత ప్రశంసలు..!!