టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రూ. లక్షల నగదు చేతులు మారిందని… వెంటనే ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా..ఈడీ కూడా ఎంటర్ కావడంతో పేపర్ లీక్ వ్యవహారం మరో టర్న్ తీసుకున్నట్లు అయింది.
పేపర్ లీక్ అంశంలో ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లోనున్న ఆధారాలతో కేసు నమోదు చేసిన ఈడీ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనుంది. సిట్ దర్యాప్తుకు సంబంధించిన కూడా వివరాలను తీసుకొని ఈడీ విచారణ స్టార్ట్ చేయనుంది. అయితే… ప్రధానంగా హవాలా లావాదేవీలపై ఈడీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హవాలా లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తోన్న ఈడీ..నిందితుల మధ్య జరిగిన నగదు లావాదేవీలపై తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి కీలక సమాచారాన్ని రాబట్టనుంది.
నిందితులు ప్రశ్నా పత్రాలను ఎంతకు అమ్మకానికి పెట్టారు.? డబ్బులు ఏ రూపంలో తీసుకున్నారు.? హవాలా మార్గంలో ఏమైనా నగదు లావాదేవీలు జరిగాయా..? అనే కోణంలో ఈడీ విచారణ జపరనుంది. ఇప్పటికే నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించడంతో ఈడీ విచారణలో మరింత దూకుడు పెంచనుంది. సిట్ దర్యాప్తు ఆధారంగా నగదు లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టనుంది. ఇప్పటివరకు సిట్ ప్రశ్నించిన వారిని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయనుంది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త డాక్వా నాయక్ తో సంబంధాలున్న వారందరిని ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రేణుక భర్త డాక్వా నాయక్ బ్యాంకు ఆర్ధిక లావాదేవీలను పరిశీలించిన సిట్ అధికారులు డబ్బుల వసూలులో అతనే కీలక పాత్ర పోషించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏఈ పేపర్ లీక్ తో డాక్వా నాయక్ ఏకంగా రూ.25 లక్షలను వసూలు చేసినట్టు గుర్తించారు. నీలేష్, గోపాల్ నాయక్ లు పొలం తాకట్టు పెట్టి రూ.13.5 లక్షలను డాక్వా నాయక్ కు అందించినట్లు సిట్ గుర్తించింది. అలాగే రాజేందర్ అనే యువకుడు కూడా రూ.5 లక్షలు, శ్రీకాంత్ అనే వ్యక్తి రూ.7.5 లక్షలను డాక్వా నాయక్ కు ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నారని సిట్ తెలిపింది.
దీంతో ఈ నగదు లావాదేవీలలో ప్రధాన నిందితురాలు రేణుక భర్తను మొదటగా ఈడీ విచారించి ఆ తరువాత ఒక్కొక్కరిని విచారణకు పిలవనుంది. విచారణ సందర్భంగా ఈ నగదు ఎక్కడి నుంచి సమకూరింది..? ఇందులో మరెవరైనా ఉన్నారా..? నిందితులకు ఎవరైనా సహకారం అందించారా..? అనే కోణంలో విచారణ జరపనుంది ఈడీ. అయితే..ఈ కేసులో ప్రభుత్వ పెద్దలపై కూడా ఆరోపణలు వస్తుండటంతో కేటీఆర్ ను కూడా విచారణకు పిలుస్తారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది.
Also Read : పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ – కవిత, కేటీఆర్ లకు సిట్ నోటిసులు..!?