ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కొత్త పేర్లు బయటకు వస్తునాయి. కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళా పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. టేక్రివాల్ రెడ్డి ఎవరో కాదు..ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన శరత్ చంద్రా రెడ్డి రెండో భార్య. మొదటి భార్యతో విడిపోయిన అనంతరం ఆయన టేక్రివాల్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమెకు ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకి ఇచ్చే కంపెనీ ఉంది. ఏపీతోపాటు తెలంగాణ నేతలు ఈమె కంపెనీ ప్రైవేట్ చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటారని అంటున్నారు.
కేసీఆర్ లాజిక్..అంటే మరోసారి ముందస్తు ఉన్నట్టే..!
దాంతో ఈమెకు టీఆర్ఎస్ కీలక నేతలతో సంబంధాలు ఏర్పడి ఉంటాయని… ఈ కారణంతోనే టేక్రివాల్ రెడ్డికి చెందిన ఫ్లైట్లలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన నగదును తరలించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కంపెనీకి చెందిన ఫ్లైట్లు బేగంపేట నుంచి ఎక్కడిక్కెక్కడికి వెళ్ళాయి..? అందులో ఎవరెవరు వెళ్ళారన్న దానిపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈడీ సేకరించింది.
కేసీఆర్ కు షాక్ – గజ్వేల్ లో ఈసారి ఎదురీతే..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరెవరి హస్తం ఉందొ కూపీ లాగుతోంది ఈడీ. తాజాగా వెలుగులోకి కొత్త పేరు బయటకు రావడంతో ఈ కేసుతో ప్రమేయమున్న మరికొంతమంది గుండెలు అదురుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసు ఏపీలో కూడా ప్రకంపనలు రేపే అవకాశం ఉందని అంటున్నారు.