జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్…శత్రువులను కూడా మిత్రులను చేసుకునే పనిలో పడ్డారా..? తనతో విబేధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను తిరిగి సొంతగూటికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలెట్టారా..? బీజేపీలో ఆయన కంఫర్ట్ గా లేకపోవడం గుర్తించి చక్రం తిప్పారా.? బీజేపీని వీక్ చేయాలంటే ఈటలను తన దారిలోకి తెచ్చుకుంటే సరిపోతుందని భావించే కేసీఆర్ తగ్గి మరీ, ఈటలను కారెక్కమని ఆహ్వానించారా..?అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మీకే తెలివి ఉందా – మాకు లేదనుకుంటున్నావా..!
ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే ఏ రంగంలోనైనా రాణిస్తారు. దీనిని కేసీఆర్ ఆచరణలో పెట్టేస్తున్నారు. గతంలో తనను విబేధించి ప్రత్యర్ధి పార్టీలోకి వెళ్ళిన నేతలను తిరిగి సొంత గూటికి రమ్మని తనే స్వయంగా ఫోన్ చేస్తున్నారు. ఇటీవల స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ లను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించిన కేసీఆర్.. తాజాగా ఈటలను కూడా పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో ఉన్నాన్నాళ్ళు తనకు కుడిభుజంగా వ్యవహరించిన ఈటలను కారేక్కించెందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలెట్టినట్లుగా ఓ ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రచురించింది.
హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీలో బలమైన నేతగా ప్రొజెక్ట్ అయ్యాడు ఈటల. భవిష్యత్ లోనూ ఈటల రూపంలో టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని కేసీఆర్ ఆందోళనగా తెలుస్తోంది. చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యను కాషాయ క్యాంప్ లో చేర్చుకోవడంలో చక్రం తిప్పారు. దాంతో భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ తన అహాన్ని తగ్గించుకొని మరీ ఈటలను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించినట్లుగా పేర్కొన్నారు. ఈటలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటే బీజేపీని దెబ్బకొట్టినట్లవ్వడమే కాకుండా, ఆ పార్టీలో మరింతమందిని లాగేయోచ్చునని కేసీఆర్ భావిస్తు ఉండొచ్చు. అయితే కేసీఆర్ ఆహ్వానం పట్ల ఈటల ఇంట్రెస్ట్ చూపలేదని చెబుతున్నారు.
టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి ఇస్తామని ఈటలకు కేసీఆర్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. కాని ఈటల మాత్రం కేసీఆర్ ఆఫర్ ను తిరస్కరించాడని ఆ కథనంలో పేర్కొన్నారు.