ఇప్పుడు ఎక్కడవిన్నా ‘దురికి మోహనరావు రచనలు’ అనే యూట్యూబ్ ఛానల్ గురించే చర్చ జరుగుతోంది. లోగడ అయన రాసిన ‘ది ఎక్స్-రే మ్యాన్’ అనే ఇంగ్లీష్ నవల అమెరికాలో పబ్లిష్ అయ్యి, 64 దేశాలల్లో విడుదలయ్యి సంచలం రేపగా అతనికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఆ నవల పలు రంగాల్లో ‘అమోజోన్ వర్డ్ రికార్డ్, ఇండియన్ వరల్డ్ రికార్డ్, స్టార్ వరల్డ్ రికార్డు లాంటి కొన్ని రికార్డ్ లు సృష్టించింది. 1985 నుంచి నేటివరకు ఆయన 600 పైగా కథలు, 12 నవలలు, 74 సినిమాలకు స్క్రీన్ ప్లే (కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్)గా రచనలు చేసి మంచి పేరు గడించారు. ఇప్పటివరకు ఆయన రాసిన ఈ రచనలను ‘దురికి మోహనరావు రచనలు’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రారంబించిన మూడు రోజుల్లోనే సంచలనం రేపుతోంది.
దీనికి కారణం ఆయన లోగడ రాసిన ‘నీతి మాలిన వాళ్ళ నీతి కథలు’ అనే కథల సిరీస్. ఇప్పటికే ఈ పుస్తకం రెండు భాగాలుగా వెలువడి (80 కథలు) తెలుగు సాహిత్యంలో ‘అతి వాస్తవ కథలు’ అనే కొత్త ప్రక్రియకు తెరలేపింది. మరో ఆరు భాగాలు రాబోతోంది. ఇప్పటివరకు కేవలం ‘వాస్తవ కథ’ లకు అలవాటు పడిన మన తెలుగు పాఠకుడికి ‘అతి వాస్తవ కథలు’ అనే కొత్త ప్రయోగం రుచి చూపించారు. ఈ రెంటికి మధ్య తేడా ఏమిటంటే – వాస్తవ కథ అనేది జరిగింది జరిగినట్లు పైపైన చెపుతుంది. కానీ ‘అతి వాస్తవ కథ’ జరిగింది జరిగినట్లు చెపుతూనే దాని లోతుల్లోకి వెళ్ళుతుంది. అందుకే – ‘రేప్ చేయబోయిన వాడిని చంపి జైలుకు వెళ్ళిన స్త్రీని సమాజం ఎందుకు గౌరవించదు?’, ‘ఒక వేశ్య కొడుకు పెరిగాక ఆ తల్లిని ఎందుకు గౌరవించాలి?’, భర్త ప్రమోషన్ కోసం భార్య పై ఆఫీసర్ తో కులికితే ఆ భర్త ఏమన్నాడు?, పక్కింటి అమ్మాయితో అతను కులుకుతాడు – కానీ అతని భార్య పక్కింటివాడితో కులికితే అతను ఏమి చేశాడు? ఇలాంటి అనేక నేరాలను – నేడు జరుగుతున్నా ఘోరాలను దురికి మోహనరావు పచ్చిగానే ఎండబెట్టారు. ఈ సంచలన రచనలు చదవాలంటే https://www.youtube.com/@DURIKIMOHANARAORACHANALU-qc3nj/videos లోకి వెళ్లి వినవలసిందే.