బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యినట్లు టి బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కి జైలులో జ్ఞానోదయం అయ్యినట్లు ఉంది. ఒక్క రాత్రి జైలులో ఉన్నందుకే ఆయనలో తీవ్ర మనస్తాపానికి గురయ్యినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతనిని అర్థ రాత్రి పోలీసుకు అరెస్ట్ చేస్తే తన వెనక బిజేపి అధిష్టానం అండగా ఉంటుంది అనుకున్నాడు. ఆ విషయం తెలియగానే అమిత్ షా, నడ్డా లాంటి నాయకులు హుటా హుటిన హైదరాబాద్ కు పరుగెత్తుకు వస్తారు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు.
డిల్లి పెద్దలు ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. పైగా రాజకీయాల్లో తెగేంత వరకు లాగొద్దు, చూసి నడుచుకోవాలి అని మందలించినట్లు తెలిసింది. దానిని తోడూ ప్రధాని మోడీ హైదరాబాద్ కి వచ్చే పర్యటన కార్యక్రమాలు చూసుకునే పనిలో ఇటు తెలంగాణ నేతలు బిజీగా ఉన్నారు. వీళ్ళు కూడా పెద్దగా పట్టించు కోలేదు. ఎవరి పనులు వాళ్ళవి. ఏ ఒక్క నాయకుడు కూడా జైలుకు వచ్చి భుజం తట్టలేదు.
దీనికి తోడూ బండి వల్ల తెలంగాణాలో బిజేపి కి మచ్చ వచ్చింది, తెలంగాణ బిజేపి అధ్యక్షుడిగా బండిని మార్చి ధర్మపురి అరవింద్ కి పగ్గాలు ఇవ్వాలనే చర్చ కూడా జరిగింది.
ఇది తెలిసి బండి మనోవేధనకు గురయ్యాడు అని తెలిసింది. ”మరి నేను ఇంతకాలం కేసీఆర్ మీద పోరాడింది ఎవ్వరి కోసం?” అనే సందేహం వచ్చింది.
”నేను ఇతర నాయకులను కరివేపాకులా వాడుకుని వదిలేసినట్లే, నన్ను కూడా అధిష్టానం వాడుకుని వదిలేసిందా?” అనే విరహం మొదలయ్యింది.
అందుకే జైలు నుంచి బయటికి వచ్చి రోజునుంచి ఈ రోజువరకు ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఎప్పటిలా కేసీఆర్ మీద విరుచుకు పడలేదు. పార్టీ కార్యకలాపాలలో పాల్గోవడం లేదు. మొత్తానికి బండి వేగం తగ్గిందో – బండిలో పెట్రోల్ ఐపోయిందో అని గుసగుసలు మొదలయ్యాయి.
Also Read : ఎమ్మెల్సీ కవిత కాలికి తాకింది సుఖేష్ గాయమేనా..?