రాబోయే 22 ఏప్రిల్, అంటే శనివారం అక్షయ తృతీయను జరుపుకొంటున్నారు. ఇదే రోజున పరుశురాముడి జయంతి కూడా. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు బిచ్చగాడు కూడా బంగారం కొంటాడు. ఎందుకు?
దీని వెనక ఒక సైంటిఫిక్ కారణం ఉంది, ఒక ఆచారం కూడా ఉంది. సైంటిఫిక్ కారణం వచ్చి – ఒంటికి రాగి, వెండి కంటే బంగారం చాలామంచింది. సూర్య కిరణంలో ఉండే ఏడు రంగుల్లో పసుపు రంగు కిరణాలను బంగారం ఆకర్షించి మన శరీరంలోకి ఎక్స్ రే లాగా పంపుతుంది.
ఈ అతి నీలలోహిత పసుపు కిరణాలు మన రక్త నాలంలోని కణాలకు బలాన్ని ఇస్తాయి. ఈ బలం మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు చాలా అవసరం. ముఖ్యంగా ప్రతి నేలా సరిగ్గా బహిస్టు కానీ స్త్రీలు బంగారం వాడితే క్రమం తప్పకుండా బహిస్టు అవుతారు. రక్త శ్రావం అదుపులో ఉంటుంది. అందుకే స్త్రీ బంగారం నిత్యం వాడాలని మనవాళ్ళు మంగళ సూత్రాలను ఖచ్చితంగా బంగారంతో చేయిస్తారు. పెళ్లి అయ్యిన స్త్రీలకు ఆరోగ్యం చాలా ముఖ్యం. అయితే ఈ పండగ రోజు సూర్యుడి కిరనణాలల్లో పసుపు కుర్నాలు ఎక్కువగా ఉంటాయి అని ఆర్య భట్ట అనే మన శాస్త్ర వేత్త మొదట కనుగొన్నారు. నవ గ్రహాలను తోలుతో ప్రపంచానికి చాటిన మేధావి ఆయనే.
ఇక ఆచారానికి వస్తే – నాడు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి అనీ చెబుతారు. దానాలే కాదు, ఈనాడు దేవతలను గుణించి, పితృదేవతలను గుణించి చేసే పూజలు కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు బంగారము కొంటే సంపద వృద్ధి అవుతుంది అని పెద్దల మాట. ధనమంటే బంగారం. దేని ధర తగ్గినా బంగారం ధర మాత్రం తగ్గదు. లక్ష్మీ దేవికి మారు రూపు బంగారం అంటారు. అంటే బంగారం ఇంటికి వస్తే సాక్షాతూ లక్ష్మీ దేవి ఇంటికి వచ్చినట్లే అని ఓ నమ్మకం తరతరాలుగా ఉంది.
దీని వెనక ఓ పిట్ట కథ కూడా ఉంది. అక్షయ తృతీయ వ్రతము పూర్వకాలంలో దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు జనభక్తుడు ఐన ఒక కోమటి ఉండెను. అతను ఒకసారి వైశాఖమాస శుక్లపక్ష మహాత్స్యము పెద్దల వలన విని అక్షయ తృతీయనాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజచేసి లడ్డు, విసిని కర్రలు దానము చేశాడు.
ఆ కోమటి ఉత్తర జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి యింట పుట్టాడు. ఆ జన్మలోనూ అతడు దాన నిరతిని వీడలేదు. ఎంతగా దానము చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాక అక్షయమవుతూ ఉండింది. ఇది అంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావము అని చెపుతారు.
ఈ రోజున ముఖ్యంగా బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగన్నం, చెరకు రసం, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, నీటితో నిండిన కలశం, ధాన్యాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.