పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి అగ్ర నేతలను కలవాలని గత మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. అయినా అధినాయకుల నుంచి ఇంకా పిలుపు రావడం లేదు. బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డతో జరిగిన చర్చల్లో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటి రాలేదు. అంతా అవుట్ ఫోకాస్ లో ఉంది.
నిన్న సాయంత్రం నడ్డతో, కేంద్ర మంత్రులు మురళీధరన్, గజేంద్ర సింగ్ షెకావత్ లను, ఇతర బిజెపి నాయకులతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి అతి కష్టం మీద నోరు విప్పారు.
‘జగన్ని గద్దె దింపడం మా ఎజెండా. బిజెపి ఎజెండా కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ని జగన్ విముక్తి రాష్ట్రంగా చేయాలని మా ఇద్దరి ఎజెండా. కాబట్టి మా మధ్య ఈ మేరకు ఓ అవగహన కుదిరింది. అయితే పొత్తుల విషయంలో ఇంకా మా మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. అంత లోతుకు ఇంకా వెళ్ళలేదు’ అని పొడిపొడిగా చెప్పారు.
బిజెపి హై కమాండ్ నుంచి వచ్చిన పిలుపుకు, ఇప్పుడు జరుగుతున్న చర్చలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. పవన్ కళ్యాన్ అనుకున్నది వేరు. అక్కడ జరుగుతున్నది వేరు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలల్లో జనసేన, బిజెపి మధ్య కుదిరే పొత్తు గురించి చర్చలు జరుగుతాయి అనుకున్నారు. కానీ జె పి నడ్డ జరిపిన ఈ చర్చల్లో ఆ అంశం రాలేదు అని తెలిసింది. కేవలం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల చుట్టే చర్చ జరిగినట్టు తెలిసింది.
బిజెపి ఎత్తుగడ వేరు. కర్ణాటకలో జరిగే ఎన్నికలల్లో పవన్ కల్యాన్ని తమ ఓటు బ్యాంకు గా మలుచుకోవాలని ఆరాటం. ఎందుకంటే కర్ణాటకలో తెలుగు వాళ్ళ ఓట్లు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారడంలో తెలుగు ఓటర్లదే కీలకపాత్ర.
కర్ణాటకలో తెలుగు వాళ్ళ ఓట్ల శాతం దాదాపు 7 నుంచి 12 శాతం మధ్య ఉంటుంది అని అంచనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి బిజెపి తరపున ప్రచారం జరిగిగే ఈ తెలుగు వాళ్ళ ఓట్లు బిజెపికి పడే అవకాశం ఉంది. ఇప్పుడు గాలి జనార్ధన్రెడ్డి కూడా అక్కడ కొత్త పార్టీ పెట్టాడు. ఆ పార్టీ గెలవకపోయినా తెలుగు వాళ్ళ ఓటును అతను చిల్చుతాడు అని బిజెపి భయపడుతోంది. అదే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిగే ఈ ప్రభావం చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది.
అయితే ముందు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకునే పోత్తులపైన ఓ క్లారిటి వచ్చాకే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొవాలని పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నాడు. కానీ ముందు కర్ణాటక ఎన్నికలల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమేరకు ఉంటుందో బిజెపి చూడాలనుకుంటోంది.అతను బిజెపి కి ఎంతవరకు అతను ఉపయోగ పడతాడో ప్రాక్తికాల్ గా చూశాకే పోత్తు పెట్టుకోవాలని చూస్తోంది బిజెపి.
ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరి అవసరం వాళ్ళది. ఎవరి లాభం వాళ్ళది. జగన్ని గద్దె దించాలన్నదే ఇద్దరి ఎజెండా. కానీ జనానికి ఎలాంటి మంచి చేయాలని ఉన్నదో ఇద్దరికీ క్లారిటీ లేదు అని తేటతెల్లం అవుతోంది.