”బిఆర్ఎస్ చేసే అక్రమాలను, కుంభకోణాలను బయిటకి తీస్తాము” అని మొన్న నగరానికి వచ్చిన మోడీ ప్రగల్బాలు పలికారు. అమిత్ షా నగరానికి వచ్చిన ప్రతిసారి ఇదే నినాదాన్ని ఆవులా తెగ నేమరువేస్తారు. ఇక టిబిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి ”బిఆర్ఎస్ చేసే అక్రమాలను, కుంభకోణాలను బయిటకి తీస్తాము. కెసిఆర్ ని జైలుకు పంపుతాము. ఆయన చేసిన పాపాలు బయటపెట్టి చిప్ప కూడు తినిపిస్తాను. ఆయన కోసం చంచల్ గూడా జైలు సిద్దంగా ఉన్నది” అని కల్లు తాగిన కోతిలా గెంతుతాడు. బాగానే ఉంది. ఎవరు తప్పు చేసినా శిక్ష పడేలా చేయడం అందరి బాధ్యత.
రూ . 800 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని యశోదా ఆసుపత్రి వాళ్లకు రూ . 100 కోట్లు అమ్మి కెసిఆర్ డబ్బులు దండుకున్నారు అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న మీడియా ముందు ఆరోపించారు. మాములుగా ఆరోపించాకుడా దానికి తగిన ఆధారాలు, డాకుమెంట్లు చూపడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. నిన్నటివరకు నిప్పులు చెరిగిన కెసిఆర్, ఆ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్లు ఒక్కసారిగా ‘తుస్సు’ మన్నట్లు మౌనం వహించారు. దీని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కనీసం దీనిని ఖండించనూ లేదు. ఈ మౌనం పలు అనుమానాలకు తావు ఇస్తోంది.
మరి పోలీసులు చేయవలసిన పనిని రేవంత్ రెడ్డి చేస్తూ, యశోదా ఆసుపత్రి కుంభకోణం వెలుగులోకి తెస్తే బిజెపి ఎందుకు చేతులు కలుపలేదు? కనీసం దీనిని సమర్ధిస్తూ రేవంత్ రెడ్డి కి అండగా ఎందుకు నిలబడలేదు? అండగా నిలబడకపోయినా కానీసం కేంద్రానికి ఫోన్ చేసి ఈడి ని, సిఐడి ని రంగంలోకి దింపాలని ఎందుకు కోరలేదు? కెసిఆర్ తప్పులు బయటపడితే అందరికంటే ముందుగా బిజెపి కి లాభం చేకూరుతుందిగా? మరి బిజెపి ఎందుకు మౌనం వహించింది?
చాలా క్లియర్ కట్ గా ఆ ఇద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపదిండి. ఒకరి మీద మరొకరు మొరగాలి. కానీ కరువకూడదు. ఎవ్వరు ఆస్పత్రికి వెళ్లి బొద్దు చుట్టూ ఇంజక్షలు చేయించుకోరాడు. మనం శత్రువులము అని ప్రజలు నమ్మాలి. కానీ మిత్రులం అనే అనుమానం రాకూడదు అనే నాటకం బయటపడింది. ఎందుకంటే ఒకరి జుట్టు మరొకరి చేతిలో ఉంది.
”డిల్లి లిక్కర్ స్కాం లో మేము కవితను కాపాడుతాము” అని బిజెపి హామీ ఇచ్చింది, ”మా బండి సంజయ్ నీ మీరు కాపాడాలి” అని లోపాయకారి ఒప్పందం కుదిరింది అని ఇప్పుడు అర్థమయ్యింది.