పిల్లకు పుట్ట కూడదు అనుకునే ప్రేమికులు అనేకరకాల పద్దతులు పాటిస్తారు. అందులో పురుషుడు రతి సమయంలో కండోమ్ వాడడం. ఇప్పుడున్న పద్దతులల్లో ఇది చాలా వాడుకలో ఉన్నది. కానీ దీనివలన రతి సుఖం సంపూర్ణంగా ఉండదు అనే అపవాదు కూడా ఉన్నది. అంతేకాకుండా ‘కాపర్- టి’ లాంటివి వాడితే కొన్ని చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే అపోహలు కూడా ఉన్నాయి.
ఇవన్ని కాకుండా గత 25 ఏళ్లుగా కెన్యా దేశంలో అమలులో ఉన్న పాతవిధానం చాలా గొప్పదని ఇప్పుడు ప్రపంచం మొత్తం దానినే ఇప్పుడు అనుసరిస్తోంది. దానిని ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతోంది. ఈ కొత్త విధానం పేరు ”సబ్ డెర్మల్ కాంట్రాసెప్టిక్ ఇంప్లాంట్”.
అంటే ఇదేదో ఆపరేషన్ కాదు. చాలా సులువు పద్దతి. స్త్రీ మోచేతి చర్మం కింద పైపొరలోతేలికపాటి సూది మాదిరి ఒక సన్నటి తీగలాంటి సాధనాన్ని అమరుస్తారు. ఇది 3 నుంచి 4సెంటీమీటర్ల మధ్యలో పొడవు, 2 నుంచి 4 మిల్లీమీటర్ల మందంతో తాడులా ఉంటుంది. ఇది నిత్యం హార్మోన్లు విడుదల చేస్తుంది.
ఈ హార్మోన్లు స్త్రీ గర్బసంచి లోకి వెళ్లి అండం విదుల కాకుండా ఆపుతుంది. ఇకవేళ అండం విడుదలయ్యినా దానిని వెంటనే చంపేస్తుంది. ఇది దాదాపు మూడేళ్ళు పని చేస్తుంది. ఆ తర్వాత మరోసారి కొత్తది అమర్చుకోవాలి. కొత్తగా పెళ్ళయిన దంపతులు పిల్లలు వద్దనుకుంటే ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఓ సంతానానికి, మరో సంతానానికి మధ్య గ్యాప్ కోరుకునేవాళ్ళు, పెళ్ళికి ముందే అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళకు ఇది గొప్ప వరం లాంటిది.
ఈ విధానం వళ్ళ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని కెన్యా దేశం ఇప్పటికే పలుమార్లు రుజువు చేసింది. దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దృవీకరించి కొన్నేళ్ళు గడిచాయి. దీనిని చైనా కూడా చాలా కాలంగా అమలు చేస్తోంది. కానీ మన దేశం ఇప్పడే మొదలు పెట్టాలని జిఓ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవలను చితంగా చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి గాను కొందరు నర్స్ లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తోందో. పిల్లకు కావాలి అనుకునే వాళ్ళు ఈ తాడును తొలగిస్తే చాలు. రెండు రోజుల నుంచి స్త్రీ గర్భం లో అందం విడుదల అయ్యి పిల్లకు పుడతారు.