ఎయిడ్స్ కంట్రోల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం నాడు, నేడు ఎయిడ్స్ రోగులు ఆంధ్రప్రదేశ్ ఒకటో స్టానంలో ఉండగా తెలంగాణ రెండో స్టానంలో దిగ్విజయంగా తమ స్టానలను కాపాడుకుంటున్నాయి. గత 20 ఏళ్లుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటో స్టానంలో ఉండగా, తెలంగాణ విడిపోవడం వలన రెండో స్టానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు రెడ్ లైట్ అడ్డాలు ఎక్కడా అంటే పెద్దాపురం, చిలకలూరి పేటా, మండపేట ఉండేటివి.
తెలంగాణాలో పాత బస్తి లోని మదీనా బిల్డింగ్, మెహంది, కోకాటటి, పత్తర్ గట్టి అడ్డాలు. కానీ కాలక్రమేనా అవి మరుగున పడ్డాయి. మరి ఇప్పుడు ఆ అడ్డాలు ఎక్కడా? చెపితే మీరు నమ్మరు. మీరు వెళ్ళేదారిలో ఎన్నో కనిపిస్తాయి, మీ చుట్టు పక్కల ఉంటాయి. కానీ మీకు తెలియదు. కానీ ఇప్పుడు వాటికి అవే బయటపడుతున్నాయి. వాటి పేరే పబ్. అదేమిటి? ప్రేమ జంటలు వెళ్లే పబ్ లల్లో రెడ్ లైట్ పనులు జరగడం ఏమిటి? అని ఆశ్చర్యపోకండి. మొన్న పోలీసులు జరిపిన ఓ సర్వేలో ఈ రహస్యం బయట పడింది. పబ్ లు ఒకప్పుడు డ్రగ్స్ కి అడ్డాగా ఉండేది. కానీ ఈ మధ్య పోలీసులు ఉక్కుపాదంతో అనిచివేయడంతో రెడ్ లైట్ పనులకు అడ్డగా మారాయి.
ఇవి ఎలా పని చేస్తాయి?
పబ్ లకు సామాన్యంగా మధ్య తరగతి అమ్మయిలు రారు. ధనవంతుల అమ్మయిలు వస్తారు. మరి ధనవంతుల అమ్మాయిలకు ఆ పాడు వ్యాపారం చేయవలసిన కర్మ ఏంటని ఆశ్చర్య పొతే – అక్కడే మీరు కండోమ్ మీద కాలు వేసినట్లు. వీళ్ళు నిజంగా ధనవంతులు కారు. మధ్య తరగతి అమ్మయిలు. కానీ ఏజెంట్లు వాళ్ళకు రిచ్ అమ్మాయిలా మేకప్ వేసి, రిచ్ బట్టలేసి, రిచ్ కార్ ఏర్పాటు చేస్తారు. పక్కనే ఓ బాయ్ ఫ్రెండ్ ని కూడా ఏర్పాటు చేస్తాడు. చూడడానికి ప్రేమికులు ఆడి పాడేందుకు అక్కడికి వచ్చారు అనే కాలర్ ఇస్తారు. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ తో పాటు అసలు ఆ ఏజెంట్ ఒకడు ఉంటాడు. పబ్ లకు వచ్చే వాళ్ళల్లో దాదాపు 50 శాతం ‘తత్కాల్’ (ఫేక్) జంటలు.
ఈ జంట ఆడుతూ పడుతూ అక్కడున్న ధనవంతుల అబ్బాయిలను చూస్తారు. ఓ బకరా దొరకగానే ఆ ప్రేయసి తన ప్రియుడికి సైగా చేసి బాత్ రూమ్ కి పంపుతుంది. ఆ తర్వాత అతనితో మాటా మాటా కలిపి తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అతని ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఆ తర్వాత బయటికి రాగానే ఎక్కడ కలవాలో, ఎప్పడు కలవాలో చెపుతుంది. గొప్పింటి కుర్రాళ్ళు వీళ్ళ టార్గెట్. అయితే పబ్ లో తప్పుడు పనులు జరగకపోయినా, ఇక్కడే రెడ్ లైట్ పనులకు పరిచయాలు మొదలవుతాయి.
ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి?
నగరంలో అధికారికంగా ఉన్న పబ్ ల కంటే అనధికారికంగా ఉన్న పబ్ ల సంఖ్య ఎక్కువ. మొత్తం కలిపి దాదాపు వెయ్యి వరకు ఉన్నట్లు ఓ అంచనా. చాలావరకు గండిపేట లో ఉన్నాయి. శంషాబాద్ నగరశివారుల్లో, రింగ్ రోడ్ చుట్టుపక్కలా ఉన్నాయి. దాదాపు 12 వేల మంది అమ్మాయిలు రెడ్ లైట్ పనులు చేస్తున్నట్లు ఓ అంచనా. అయితే ఇందుల్లో ఎక్కువమంది అమ్మయిలు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారే. వీళ్ళు ఎక్కువగా ముంబై, చెన్నై, బెంగుళూరు, కోల్ కత్తా, సూరత్, కాన్పూర్ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఫైవ్ స్టార్ హోట్లు బుక్ చేసుకుని వీక్ ఎండ్ లో ఉంటారు. పబ్ లో పరిచయమైన కుర్రాళ్ళను హోటల్ కి పిలిపించుకుంటారు.
రేట్ ఎంత?
వీళ్ళ రేటు ఒక్క రాత్రికి కనీసం 25 వేల నుంచి మొదలవుతుంది. ఇక ఎక్కడ ముగుస్తుందో తెలియదు. వీటితోపాటు పలనా హీరోయిన్ తన కజిన్ అని కుర్రాలను నమ్మిసారు. హీరోయిన్ తో దిగిన ఫోటోలు చూపుతారు. ఆమె రేట్ చెప్పుతుంది. బేరం కుదరగానే ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి ఏజెంట్ పిలుస్తాడు. హీరోయిన్ ల రేట్ రూ. రెండు లక్షల నుంచి మొదలవుతుంది. హీరోయిన్ అవకాశాలు లేనివాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ నెలకు రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలు సంపాదిస్తున్నట్లు ఈ మధ్య పట్టుబడిన ఓ హీరొయిన్ చెప్పింది.