అన్ని ప్రాణులకు నీరు అనేది జీవనాధారం అని తెలిసిందే. నీరు తాగకుండా ఏ జీవి మనుగడ కొనసాగించలేదు. ఉదయం పరిగడుపునే నీరు తాగడం అనేక విధాల శ్రేయస్కరం. ఎందుకంటే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం నిద్ర లేచే వరకు కడుపుకు విశ్రాంతినివ్వడంతో కడుపు ఇబ్బందిగా ఉంటుంది. అదే సమయంలో ఉదయాన్నే నీటిని తాగడం వలన మిశ్రమ ప్రయోజనాలు ఉన్నాయి.
నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే మంచి నీళ్ళు తాగడం వలన జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం ఇబ్బందిగా ఉండదు. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు ఉదయాన్నే నీళ్ళు తాగడం మరీ మంచిది. కడుపులో ఎసిడిటి తగ్గుతుంది. జీర్ణక్రియలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తుంది. ఇంకా చర్మం ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణకు ఇబ్బంది లేకుండా చేస్తుంది.
పరిగడుపున నీళ్ళు తాగడం వలన శరీరంలో ఉండే ట్యాక్సిన్లు బయటకు వెళ్ళేలా చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉంటె తొలగించేందుకు దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
ఉదయమే నిద్ర లేచిన వెంటనే నీళ్ళు తీసుకోవడం వలన శరీరంలోని ఉండే వ్యర్ధాలు బయటకు వెళ్తాయి. కలుషిత పదార్థాలను రక్తం నుంచి మూత్రం, మలం ద్వారా పంపించేందుకు సహాయం చేస్తుంది. ఉదయం పూట గ్లాస్ నీళ్లు తాగడం వల్ల మన శరీరం ఎంతో లాభ పడుతుంది. మలినాలు బయటకు పోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఇక నుంచి ఉదయాన్నే మంచినీళ్ళు తాగడం అలవాటుగా చేసుకోండి.
Also Read : చిన్న వయస్సులో గుండెపోటుకు ఇదేనా కారణం..?