95 ఆస్కార్ అవార్డుల కార్యక్రమాల వేడుకలకు అయ్యే ఖర్చు చూస్తే గుండె జల్లు మంటుంది. ఈ అవార్డుల కోసం అయ్యిన ఖర్చు మొత్తం 56.6 అమెరికన్ మిలయన్ డాలర్లు. మన రూపాయలలో 463,92,47,300. ఇందులో పాల్గొనే వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ సూట్ ఖరీదు రూ. 1.౩౦ కోట్ల నుంచి మొదలవుతుంది. రెడ్ కార్పెట్ దగ్గర స్వాగతం పలికే నటి వేసుకునే డ్రెస్ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మీరు నమ్మగలరా?
దరఖాస్తు రుసుము నుంచి మొదలు కొని నామినేట్ అయ్యే వరకు ఆస్కార్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. ఎవరి ఖర్చు వాళ్లు పెట్టుకోవాల్సిందే. ప్రతి క్యాటగిరిలో నామినేషన్ దక్కిన 5 సినిమాల నుంచి ఆస్కార్ ఖర్చులు భరిస్తుంది.
ఈ వేదిక మీద ఏదైనా వ్యాపార ప్రకటన ఇవ్వాలంటే ౩౦ సెకన్లకు 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలి. మన కరేన్సిలో రూ. 16,39,31,000. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసే హక్కులను బిడ్ ల ద్వార నిర్వహిస్తుంది ఆస్కార్ కమిటి. ఆ రోజు ఒక్క యూరప్ లోనే టీవీ లో 40 శాతం రేటింగ్ పెరుగుతుంది. కాబట్టి వ్యాపార ప్రకటనలు కుప్పలు తెప్పలుగా వస్తాయి. అందుకే టివి చానెళ్ళు, వెబ్ సైట్ లు పోటిపడతాయి.
ఇక గెస్ట్ ల కోసం భోజనాలు ఏర్పాటుకు క్యాటరింగ్ కోసం కూడా బిడ్ లు నిర్వహిస్తారు. ఆస్కార్ కార్యక్రమలు జరిగే ధియేటర్కు దాదాపు 100 కిలో మీటర్ల పరిసర ప్రాంతాలు పోలీసుల ఆదీనంలోకి వెళ్తాయి. 48 గంటల పాటు పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే ఆ ప్రాంతంలోకి అనుమతి ఇస్తారు. రెగ్యులర్ వాహనాలకు అనుమతి ఇవ్వరు. దాదాపు పది వేల మంది పోలీసులు అడుగడునా ఉంటారు. నాలుగు అంచెల బధ్రత ఉంటుంది. అంటే అమెరికా ప్రెసిడెంట్కు ఉండే సెక్యురిటి. ఏ మాత్రం తేడా వచ్చి బాంబులు పేలినా అది ప్రపంచ యుద్దానికి దారి తీయవచ్చు.