జబర్దస్త్ షో ఎంతోమందికి కొత్త లైఫ్ ఇచ్చింది. ఈ షో నుంచి వచ్చిన ఎంతోమంది నేడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ గా వెలుగొందుతున్నారు. వారి కాల్ షీట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సుడిగాలి, సుదీర్. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది.. ఇలా ఎంతోమంది లగ్జరీ లైఫ్ కు కారణమైంది జబర్దస్త్ కామెడి షో. జబర్దస్త్ వలన కిరాక్ ఆర్పీ కూడా ఫేమస్ అయ్యాడు.
మల్లెమాల సంస్థతో ఏమైందో ఏమో కాని జబర్దస్త్ ను వీడి మాటీవీలో పలు షోస్ చేశాడు ఆర్పీ. అక్కడ సంపాదించిన డబ్బుతో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసేశాడు. హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే రెస్టారంట్ ని ప్రారంభించాడు. హైదరాబాదీలకు చేపలంటే బాగా ఇష్టం. చేపల రెస్టారెంట్ పెడితే సక్సెస్ అవుతామని సరికొత్త ఐడియతో ఈ రెస్టారెంట్ ప్రారంభించాడు.
మొదట్లో చిన్న రెస్టారెంట్ నడుపుదామని ప్లాన్ చేశాడు. కాని ఊహించని విధంగా సక్సెస్ అయింది. హైదరాబాదీలు మొత్తం ఆ రెస్టారెంట్ ముందు చేపల కర్రీ కోసం కొట్టుకుచచ్చేలా ఆక్కడి వంటకాలు నోరూరించేలా ఉన్నాయి. కేవలం హైదరాబాద్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా గంటలకొద్దీ క్యూ లైన్ లో నిల్చొని చేపల కర్రీని తీసుకెళ్తున్నారు.సక్సెస్ ఊహించని రేంజ్ లో రావడం, రోజు రోజుకి జనాల తాకిడి పెరిగిపోతూ ఉండడంతో కొంతకాలం వరకు రెస్టారంట్ ని మూసివెయ్యాలని ఆర్పీ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని రోజుల్లో ఎక్కువమంది స్టాఫ్ తో మీ రెస్టారెంట్ ను ప్రారంభిస్తానని తెలిపారు కిరాక్ ఆర్పీ. ఈ రెస్టారంట్ ద్వారా ఆర్ఫీకి ఒక రోజు జరిగే బిజినెస్ ఎంతో తెలుసా..?పది లక్షల రూపాయలట..అంటే నెలకి మూడు కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నాడు అన్నమాట. అసలు ఈ చేపల రెస్టారెంట్ సరిగ్గా నడుస్తుందో లేదోనని సందేహంతో ప్రారంభించి కోట్ల వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నాడు ఆర్పీ.