మొదటినుంచి వివాదస్పదంగా మారిన ‘జననన్న విద్యాకానుక’ మరోసారి ముడుపుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల్లల్లో పేద విద్యతులకు ఉచితంగా ఇచ్చే బ్యాగులు, బూట్లు, సాక్సులు తక్కువ నాణ్యతతో, ఎక్కువ ధరలో జగన్ ప్రభుత్వం కొని సరఫరా చేసి, అక్రంగా కోట్లు దండుకుంది అని గత ఏడాది ప్రతిపక్షాలు ఆరోపించారి. ‘విద్యా కానుకలో’ పంచిన బ్యాగులు నాణ్యత లేకపోవడంవల్ల నెల రోజుల్లోనే చినిగిపోయాయి. బూట్లు వారం రోజులకే తూట్లు పడ్డాయి. సాక్సులు చినిగిపోయాయి.
చిన్న పిల్లలు కావడం వలన వెంటనే చించేసారు అని జగన్ తప్పించుకోడానికి చూసారు. దీనికి తోడూ వాటి ధరలు మార్కెట్ ధర కంటే ౩౦ శాతం ఎక్కువని కాంగ్రెస్ నాయకులు బయట పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు. ప్రభుత్వం చూపిన లెక్కల ఆధారంతో 39,96,064 విద్యార్థులక కిట్ లు పంచారు. ప్రతి కిట్ కు రూ. 50 నుంచి రూ. 75 జగన్ ప్రభుత్వానికి ముడుపులు ముట్టాయని కాంగ్రెస్ అరూపించింది. ఈ లెక్కన కోట్ల రూపాయలు విద్యాశాఖకు కాంట్రాక్టర్ ఇచ్చారని ఆరోపించారు.
నిజానికి లేక్కలల్లో చూపిన విధంగా 39,96,064 మంది విద్యార్థులకు కిట్ లు పంచలేదని, దాదాపు 25 శాతం కోత విధించి, ఆ డబ్బులు కూడా నొక్కేశారు అన్నది మరో ఆరోపణ. ఇప్పటివరకు ‘విద్యా కానుక’ కిట్ లు అందని బడులు ఆంధ్రప్రదేశ్ లో కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. జగన్ మాత్రం ఈ నిందలను కాంట్రాక్టర్ అకౌంట్ లో వేశారు.
అయితే ఆ కాంట్రాక్టర్ ని మార్చేస్తామని జగన్ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. 172 కొత్త జి ఓ తో ఈ ఏడాది కొత్త టెండర్లు పిలిచారు. ఎంతో హడావుడి చేసారు. తిరిగి తిరిగి అదే పాత కాంట్రాక్టర్ కే మొత్తం పనిని మరోసారి అప్పగించారు జగన్. దానికి తోడూ గత ఎదాదికంటే ఈ ఏడాది ఎక్కువ ధరకు అప్పగించారు. గత ఏడాది ప్రభుత్వం కొనుగోలు చేసినదానితో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వానికి రూ. 155.84 కోట్లు అదనంగా ప్రభుత్వనికి ఖర్చు పెరిగింది.
దీనికితోడు, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యా బాగా తగ్గింది. అయినా అదే 39,96,064 విద్యార్థులకు కిట్ లు పంచామని మరోసారి పెద్ద కుంభకోణానికి జగన్ తెర లేపారని కాంగ్రెస్ నేతలు దుయ్యబడుతున్నారు.